ప్రేమ జంట ఆత్మహత్య.. కాగజ్‌నగర్‌లో విషాదం
By అంజి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగజ్‌నగర్ పట్టణం సమీపంలోని అంకుషాపూర్ శివారులో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు సార్సాల గ్రామానికి చెందిన సంతోష్ (34), దాహెగం మండలం బిబ్రాకు చెందిన శైలజ (20)గా స్థానికులు గుర్తించారు. ఇద్దరూ కలిసి ఒకే చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృత దేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: తెల్లని కోటులో ఉన్నవారు దేవుని రూపం: మోదీ
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి యువకుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌కు గతంలోనే పెళ్లైందని సమాచారం. ప్రేమ జంట ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రేమ జంట ఆత్మహత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: క్రిస్‌గేల్‌కు మహిళా క్రికెటర్ బంఫర్ ఆఫర్.. ‘టాయిలెట్ పేపర్, రమ్ తీసుకొని రా’