తెల్లని కోటులో ఉన్నవారు దేవుని రూపం: మోదీ

By సుభాష్  Published on  25 March 2020 12:54 PM GMT
తెల్లని కోటులో ఉన్నవారు దేవుని రూపం: మోదీ

ఆపద కాలంలో తెల్లటి కోటులో ఉన్నవారు దేవుని రూపమని, వాళ్లు ప్రాణాలను కాపాడుతున్నారని ప్రధాని నరేంద్రమోద అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను, నర్సులను కరోనా భయంతో ఇళ్ల నుంచి ఓనర్లు వెళ్లగొట్టడం చాలా నిరుత్సాహపడ్డానని ఓ మహిళా డాక్టర్ చెప్పగా, దానికి స్పందించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 18 రోజుల్లోనే మహాభారతం గెలిచిందని, కానీ కరోనాపై మన యుద్ధం 21 రోజులు తీసుకుంటుందని అన్నారు. కరోనా కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

వూహాన్ నగరం సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మన భారతీయులను క్షేమంగా తీసుకొచ్చిన వైద్యులు, రెస్క్యూ వర్కర్లు, ఎయిర్ ఇండియా, ఇతర సిబ్బంది మన నిజమైన హీరోలని అన్నారు.

మన వారికి తప్పకుండా సహాయం చేయాలని అన్నారు. వాళ్లను వేధించబడ్డారని తెలిసిన వెంటనే ఆ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకున్నానని అన్నారు. చాలా సీరియస్ గా తీసుకునే విషయమన్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు తెలిపినట్లు మోదీ అన్నారు. నేను మామూలుగా అయితే వారణాసిలో వచ్చి ఉండాలని, కానీ కరోనా కారణంగా రాలేకపోతున్నానని మోదీ అన్నారు.

కరోనా వైరస్ ను సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో ఏదైన అవసరమైతే సమాచారం కోసం 8013151515 వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

Next Story