క‌రోనా ముప్పుతో ఇప్ప‌టికే ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా కాలాన్ని గ‌డుపుతున్నారు. కాగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌనిల్స్‌(ఐసీసీ) క్రికెటర్లని ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. కొంత మంది క్రికెటర్ల ఫొటోలతో GIF‌ని అభిమానులతో పంచుకుంది. ‘‘క్వారంటైన్‌‌లో ఉంటే మీ పార్టనర్‌‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారో.. స్క్రీన్‌షాట్ తీసుకుని షేర్ చేయండి’’ అని ఐసీసీ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు ఇప్ప‌టికే చాలా మంది క్రికెట‌ర్లు స్పందించారు. భార‌త కెప్టెన్ విరాట్‌కోహ్లీ త‌న పార్ట‌న‌ర్‌గా ఉండాల‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ హిట్ట‌ర్ గిబ్స్ అన్నాడు. ‘‘క్వారంటైన్‌లో కోహ్లీతో కలిసి జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకుంటున్నా’’ అని గిబ్స్ ట్వీట్ చేశాడు.

తాజాగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్ చేసిన ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న క్వారంటైన్ పార్ట‌న‌ర్‌గా వెస్టిండిస్ క్రికెట‌ర్ క్రిస్‌గేల్ ను ఎంచుకుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. క్రిస్‌గేల్ ఫోటోతో పాటు కింద ఓ కామెంట్ రాసింది. ‘‘క్రిస్‌గేల్ టాయిలెట్ రోల్, కొంత రమ్(ఆల్కహాల్) తీసుకురావడం మరిచిపోకు’’ అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌కు నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందించారు.’అమ్మ‌డు జాగ్ర‌త్త అక్క‌డ ఉంది క్రిస్‌గేల్.. యూనివ‌ర్స‌ల్ బాస్ త‌ట్టుకోలేవు’  అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. క్రిస్‌గేల్‌కు పండ‌గే అంటూ ఇంకో నెటీజ‌న్ కామెంట్ చేశారు.

విదేశాల నుంచి స్వదేశాలకి వెళ్లిన క్రికెటర్లు అక్కడి ప్రభుత్వాల ఆదేశాల మేరకు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. భారత్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు, ఆస్ట్రేలియా టూర్ నుంచి స్వస్థలాలకి వెళ్లిన న్యూజిలాండ్ క్రికెటర్లు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort