తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బుధవారం అర్థరాత్రి లారీ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో తన ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం ను దుండగులు కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించి భార్య కళ్ళెదుటే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్‌ను రపించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

తన కళ్లెదుటే భర్తను దుండగులు దారుణంగా హత్య చేయటంతో ఆమె షాక్ కు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోయింది. బ్రహ్మానందాన్ని హత్య చేసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న దండగుల కోసం గాలిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.