రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తాను ఓ తల్లిని అన్న విషయాన్ని మరిచిపోయింది. ఏడాదిన్నర వయసు ఉన్న కొడుకును చంపి.. ఆ నెపాన్ని కట్టుకున్న భర్త పై వేసి ప్రియుడితో పరారుకావాలనుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కేరలో చోటు చేసుకుంది.

ఓ మహిళ నీచానికి ఒడిగట్టింది. ఏడాదిన్నర వయసున్న కొడుకుని గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ చిన్నారి శవాన్ని తుప్పల్లో పడేసింది. ఆ తరువాత తనకేమి తెలియనట్లుగా నటించింది. ఆ నేరాన్ని తన భర్తపై నెట్టేసేందుకు ప్రయత్నించింది. అప్పటికే బాలుడు కనపడకపోవడంతో స్థానికులు ఆ చిన్నారి కోసం చుట్టూ పక్కల వెతకకగా తుప్పల్లో ఆ చిన్నారి శవాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని బయట పెట్టింది.

కొడుకుని ఎలా చంపిందన్న విషయంపై ఆరా తీసేందుకు ఆ రాక్షసిని సంఘటన స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు. మర్డర్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు నిందితురాలిని తీసుకెళ్లిన సమయంలో స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.