2024 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

2024 సంవత్సరం చాలా మంది సెలబ్రిటీలకు ప్రేమ, వేడుకలతో నిండిపోయింది. ఈ సంవత్సరం పలువురు ప్రముఖులు పెళ్లి పీటలు ఎక్కారు.

By అంజి  Published on  22 Dec 2024 1:41 PM IST
celebrity weddings, 2024 Year, Tollywood, Bollywood

2024 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

హైదరాబాద్: 2024 సంవత్సరం చాలా మంది సెలబ్రిటీలకు ప్రేమ, వేడుకలతో నిండిపోయింది. ఈ సంవత్సరం పలువురు ప్రముఖులు పెళ్లి పీటలు ఎక్కారు. అలా ఈ ఏడాది బ్యాచ్‌లర్ జీవితానికి ముగింపు నిచ్చి వివాహబంధంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కీర్తి సురేష్ - ఆంటోని

ఇటీవలే హీరోయిన్‌ కీర్తి సురేష్ తన చిన్న నాటి ఫ్రెండ్‌, బిజినెస్‌మెన్‌ ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగింది. ప్రస్తుతం కీర్తి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృతి కర్భందా - పులకిత్‌ సామ్రాట్‌

'తీన్‌మార్‌' మూవీతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన కృతి కర్భందా, తన ప్రియుడు పులకిత్‌ సామ్రాట్‌తో ఏడడుగులు వేసింది. ఈ ఏడాది జరిగిన వీరి పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

క్రిష్ జాగర్లమూడి - డాక్టర్ ప్రీతీ చల్లా

ప్రముఖ దర్శకుడు క్రిష్ రీసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు డాక్టర్ రమ్యని వివాహమాడి విడాకులు తీసుకున్న క్రిష్.. మరోసారి డాక్టర్‌నే చేసుకోవడం విశేషం. డాక్టర్ ప్రీతిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.

చాందిని రావు - సందీప్ రాజ్

'కలర్ ఫొటో' సినిమా డైరెక్టర్‌ సందీప్ రాజ్.. ఆ సినిమాలోనే ఓ రోల్‌లో నటించిన చాందిని రావుని ఇటీవల వివాహం చేసుకున్నారు. తిరుపతిలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. కలర్‌ ఫొటో సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

మేఘ ఆకాష్ - సాయి విష్ణు

'లై' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాశ్‌ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడింది. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎప్పటి నుండో రిలేషన్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది.

ఐశ్వర్య అర్జున్ - ఉమాపతి

ప్రముఖ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో జరిగింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

సుబ్బరాజు - స్రవంతి

ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు దాదాపు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. స్రవంతి అనే అమ్మాయితో ఆయన పెళ్లి జరిగింది. వీరి పెళ్లి ఫొటో రీసెంట్‌గా నెట్టింట వైరల్ అయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ - నికోలాయ్ సచ్‌దేవ్

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన చిరకాల ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడైన నికోలాయ్ సచ్‌దేవ్‌, వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా రోజుల పాటు ప్రేమలో ఉన్నారు.

తాప్సీ - మథియాస్ బోయ్

హీరోయిన్‌ తాప్సీ కూడా ఈ సంవత్సరంలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌‌ని పెళ్లి చేసుకుని, కొత్త లైఫ్‌ని ప్రారంభించింది.

కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం తనతో కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్‌ని లవ్‌ చేసి వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

సిద్ధార్థ్ - అదితి రావు హైదరి

ఈ ప్రేమ జంట ఇటీవలే పెళ్లి చేసుకుంది. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్ద‌రి వివాహం ఘ‌నంగా జరిగింది. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.

రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ

ఒకప్పటి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా సినిమాలు చేయడం లేదు.

నాగచైతన్య-శోభిత

అక్కినేని నాగచైతన్య-శోభితలు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య, శోభిత ప్రేమలో పడ్డారు. వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

శ్రీసింహా - రాగ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ సింహా కొడూరి పెళ్లి.. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగతో జరిగింది. ఈ పెళ్లిలో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story