మీకు బుర్రుందా.. అసెంబ్లీ వద్ద మార్షల్స్‌పై విరుచుకుపడ్డ లోకేష్‌

By సుభాష్  Published on  13 Dec 2019 10:59 AM IST
మీకు బుర్రుందా.. అసెంబ్లీ వద్ద మార్షల్స్‌పై విరుచుకుపడ్డ లోకేష్‌

ఏపీ అసెంబ్లీ ముందు టీడీపీ నిరసనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మీడియాపై ఆంక్షలు విధిస్తూ, ఏపీ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో2430 వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నాయుడు నిరసనతో పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. చేతిలో ప్లకార్డులు, నిరసన బ్యాడ్జీలతో రావడంతో ... వాటితో సమావేశాలకు అనుమతి లేదంటూ మార్షల్స్‌ చంద్రబాబుతో సహ టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలకు, మార్షల్స్‌ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో వీరి మధ్య తోపులాట జరిగింది. ఇక చంద్రబాబును మార్షల్స్‌ లోపలికి అనుమతించకపోవడంతో నారా లోకేష్‌ చీఫ్‌ మార్షల్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూజ్‌లెస్‌ ఫెలో, మీకు బుర్రుందా... అంటూ వారిపై లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగ్రహంతో మార్షల్స్‌ పై తిట్ల దండకం అందుకున్నారు లోకేష్‌. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

Next Story