లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట విషాదం
By తోట వంశీ కుమార్Published on : 30 Sept 2020 1:35 PM IST

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్ నిబంధనల నడుమ స్వస్థలం రాజస్తాన్‌లోని కిషోరాపూర్ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read
సంచలనం.. సమస్య సమాప్తంశ్రీకృష్ణ బిర్లా మృతి పట్ల ఎంపీలు, బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక ఓం బిర్లా రాజస్తాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Next Story