లాక్‌డౌన్‌ 4.0: కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

By సుభాష్  Published on  24 May 2020 12:26 PM GMT
లాక్‌డౌన్‌ 4.0: కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మే 31వ తేదీ వరకూ కొనసాగే ఈ లాక్‌డౌన్‌పై ఇప్పటికే ఎన్నో మార్గదర్శకాలను విడుదల చేస్తూ సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం మరి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం సర్కార్‌. మే 25వ తేదీ నుంచి డోమెస్టిక్‌ విమానాల సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే అంతర్జాతీయ విమానాలు కూడా జూన్‌, లేదా ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో విదేశీ విమానాల ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

కొత్త మార్గదర్శకాలివే..

► విమానం ఎక్కేముందు ప్రయాణికులు తాము 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో వారం రోజులు పెయిడ్‌ క్వారంటైన్‌, ఆ తర్వాత మరో వారం రోజులు హోం క్వారంటైన్‌ ఉండాల్సి ఉంటుంది.

► కొన్ని కారణాల వల్ల మానసిక ఒత్తిడి, గర్భం, కుటుంబంలో ఎవరైనా మృతి చెందినా, తీవ్ర అనారోగ్యం, తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న పది సంవత్సరాలలోపు పిల్లలు, ఆయా రాష్ట్రాలు పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిరి వినియోగించాలి.

► అలాగే ప్రయాణికులు ఏం చేయాలి. ఏం చేయకూడదు అనే అంశాలను టికెట్‌కు అనుబంధంగా అందజేస్తారు.

►ప్రయాణికులు ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను మొబైల్లో ఉండాల్సి ఉంటుంది.

► ప్రయాణికులు విమానం లేదా షిప్‌ ఎక్కే ముందు థర్మల్‌ స్క్రీన్‌ తప్పనిసరి. అలాగే కరోనా లక్షణాలు లేనివారికే ప్రయాణానికి అనుమతి.

► రోడ్డుమార్గం ద్వారా ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే వారికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

► సెల్స్‌ డిక్లరేషన్‌ ఫాం పూర్తి చేసి దాడి డూప్లికేట్‌ కాపీని విమానాశ్రయం, సీపోర్ట్‌, లాండ్‌ పోర్ట్‌ల్లో హెల్త్‌, ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఈ ఫాం ఆరోగ్య సేతులో కూడా అందుబాటులో ఉంటుంది.

► విమానాలు, విమానాశ్రయాల్లో పర్యావరణ పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేయాలి.

► విమానంలో భౌతిక దూరం తప్పనిసరి.

► కోవిడ్‌-19కు సంబంధించిన అన్ని రకాల హెచ్చరికలను విమానాశ్రయాలు, సీ పోర్టుల్లో ఏర్పాటు చేయాలి.

► విమానం, షిప్‌లలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

► ప్రయాణికులు దిగిన తర్వాత తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌

►ప్రయాణికుడికి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

► అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. వారిని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి.

Next Story