లాక్‌డౌన్‌: తెలంగాణలో మరిన్ని సడలింపులు ఇవే..

By సుభాష్  Published on  16 May 2020 5:37 AM GMT
లాక్‌డౌన్‌: తెలంగాణలో మరిన్ని సడలింపులు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో లాక్‌డౌన్‌ మే 29 వరకూ కొనసాగనుంది. శుక్రవారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ నుంచి మరికొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి.. గత ఐదు రోజులుగా మళ్లీ పెరిగాయి. అదికూడా ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇతర జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

ఇక తాజా నిర్ణయంతో శనివారం నుంచి ఎసీలు అమ్మే షాపులు, ఆటో మొబైల్స్‌ షో రూమ్‌లు, ఆటో మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ షాపులు తెరిచేందుకు కేసీఆర్‌ అనుమతి ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలకు కొనసాగుతాయని తెలిపారు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మే 17వ తేదీతో ముగియనుంది. అయితే కేంద్రం కూడా మరి కొన్ని లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర పరిస్థితులపై సమీక్షిం మరి కొన్ని సడలింపులు ఇస్తామని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే వారిపై..

ఇక విదేశాల నుంచి తెలంగాణ వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విమానాల ద్వారా హైదరాబాద్‌కు వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి, వైరస్‌ ఉంటే ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. లేకుంటే హోమ్ క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంటుందన్నారు.

ఇక యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలక చెందిన వలస కూలీలకు కొందరికి కరోనా వైరస్‌ సోకింది తప్ప.. ఆ జిల్లా వాసులకు ఎవ్వరికి కరోనా లేదని తెలిపారు. వారందరిని గాంధీకి తరలించినట్లు చెప్పారు. కరోనా వైరస్‌ ఎంత కాలం ఉంటుందో తెలియదని, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగానే ఉండాలని సూచించారు. కరోనా పూర్తిగా తగ్గినా.. కొన్ని రోజుల పాటు అప్రమత్తంగానే ఉండాలన్నారు.

హైదరాబాద్‌ బస్తీలో మరో 45 ఆస్పత్రులు

ఇక నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్‌ ను పిచికారీ చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో మరో 45 బస్తీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్న వారు ఎక్కువ మందే ఉన్నారని, రాష్ట్రంలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే ఉందన్నారు. ఇక దేశంలో సగటు 3.5 శాతం ఉందన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే దేశ వ్యాప్తంగా మరణాల రేటు కూడా తక్కేవేనని అన్నారు.

Next Story