లాక్‌డౌన్ : కొవిడ్-19 వ్యాప్తిని నెమ్మ‌దిస్తుందా.. నివారిస్తుందా..?

By Kumar Sambhav Shrivastava  Published on  23 April 2020 1:45 AM GMT
లాక్‌డౌన్ : కొవిడ్-19 వ్యాప్తిని నెమ్మ‌దిస్తుందా.. నివారిస్తుందా..?

లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ఏర్పాట్లను చేయగలిగిందని.. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమాయత్తం కాలేకపోయిందా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 20, 2020న అతిపెద్ద లాక్ డౌన్ ను అమలు చేశారు. అలా లాక్ డౌన్ అమలు చేసిన వారానికి భారత్ లోని టాప్ మెడికల్ రీసర్చ్ సంస్థ మాట్లాడుతూ షట్ డౌన్ కారణంగా భారత్ కోవిద్-19 వైరస్ ఇన్ఫెక్షన్లను కేవలం 20-25 శాతం వరకు మాత్రమే ఆపగలిగిందని తెలిపింది.

ఈ ప్రభావం కేవలం తాత్కాలికమైనది మాత్రమేనని.. ప్రభుత్వం శాస్త్రీయంగా కొలమానాలను బేరీజు వేసుకుని ఈ మహమ్మారి మీద పోరాటం సాగిస్తేనే ఇన్ఫెక్షన్లను ప్రబలకుండా ఆపవచ్చు.

కోవిద్-19 మహమ్మారితో పోరాడడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐ.సి.ఎం.ఆర్.) ప్రభుత్వ ఏజెన్సీ డాక్టర్లకు, ఎపిడెమియాలజిస్టులకు, మిగిలిన నిపుణులకు అన్ని ఆదేశాలను అంతర్గతంగా జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22, 2020 నాటికి 20471 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 652 మంది మరణించారు.

'రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి అన్నది సాధారణంగానే ఉంటుందని' ఐ.సి.ఎం.ఆర్. కు చెందిన ఆర్టికల్ 14ను బేస్ చేసుకుని వినోద్ కె.పాల్ తెలిపారు. మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు వినోద్ కె.పాల్. ఈయన నీతి ఆయోగ్ లో కూడా సభ్యుడే. భారత్ లో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) లేదని తెలిపారు. మోదీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం కారణంగా ఆర్థికంగా కష్టాలు తప్పవని, కొన్ని విషయాల్లో నొప్పి బాధ అన్నవి ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా పేదలకు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. పాల్ ప్రెజెంటేషన్ ప్రకారం ఇన్ఫెక్షన్లు దాదాపు 40 శాతం తగ్గాయన్నారు. ప్రభుత్వం సరైన ముందస్తు చర్యలు తీసుకోడానికి సమయం ఉన్నా కూడా అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోలేకపోయిందని తెలిపింది.

ఏయే ప్రాంతాలలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం గడప.. గడపకు వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయించాలి. పెద్ద ఎత్తున క్వారెంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం కారణంగా మహమ్మారి తారాస్థాయికి చేరుకునే అవకాశాన్ని ఇవ్వలేమని పాల్ తెలిపారు. పాల్ చూపించిన గ్రాఫ్ వివరాలు:

Huff1

లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా పలు ముందస్తు చర్యలను తీసుకోవచ్చని పాల్ తన ప్రెజెంటేషన్ లో తెలిపారు. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించింది. ఆయన ఓ వారంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగలదని తెలిపారు. డేటాను తయారుచేయడానికి, లాక్ డౌన్ ముగిసేలోగా డేటాను సేకరించడానికి, జాతీయ మరియు జిల్లాల వారీగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోడానికి వారం కంటే ఎక్కువ సమయం తీసుకోదని అన్నారు.

జ్వరం, దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పాల్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ప్రకారం భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలివే:

*గడప గడపకు వెళ్లి పేదలకు కావాల్సిన నిత్యావసరాలను అందించాలి.

*ప్రతి ఒక్క జిల్లాలోని కోవిద్-19 కు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి.

*'వేగవంతమైన రిపోర్టింగ్' ద్వారా క్వారెంటైన్ సదుపాయాలపై ఓ అంచనాకు రావచ్చు.

*మురికివాడల్లో నివసించే వాళ్లకు సెంట్రల్ క్వారెంటైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన వాళ్ళను హోమ్ క్వారెంటైన్ లో ఉంచవచ్చు

*యుద్ధప్రాతిపదికన ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ , హాస్పిటల్ బెడ్స్ ను పెంచుకుంటూ వెళ్ళాలి.

పాల్ చెప్పినట్లుగా వెంటిలేటర్లను, ఆసుపత్రి బెడ్ లను ఏప్రిల్ మొదటి వారంలో కూడా భారత్ లో ఏర్పాటు చేయలేదట. మహమ్మారితో పోరాడడానికి ఏర్పాటు చేయాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కు చాలా సమయమే పడుతుందని అన్నారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక ప్రాంతంలో రోజూ ఇన్ఫెక్షన్లు 500కి దగ్గరగా ఉంటే.. 150 వెంటిలేటర్లు అవసరం. 300 ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ అవసరం ఉంది... అలాగే 1200-6000 బెడ్లను ముందస్తుగా ఏర్పాటు చేసి పెట్టుంచాలి.

పాల్ చేసిన ప్రెజెంటేషన్ కాకుండా.. ఐ.సి.ఎం.ఆర్. కూడా తమ రీసర్చ్ కు సంబంధించిన సమాచారాన్ని ముందు పెట్టింది.

ఊహించని స్థాయిలో పెద్ద ఎత్తున వైరస్ ప్రబలే అవకాశం ఉంది:

ఊహించని స్థాయిలో వైరస్ ప్రబలితే దాన్ని కట్టడి చేయడం సమస్య అవుతుందని ఐ.సి.ఎం.ఆర్. తన ప్రెజెంటేషన్ లో అంచనా వేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రెజెంటేషన్ ను పాల్ కు ఏప్రిల్ మొదటి వారంలో పంపారు.

లాక్ డౌన్ కారణంగా కోవిద్-19 వ్యాప్తి 40 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. కానీ ఆ ప్రభావం కేవలం 20-25 శాతం మాత్రమే ఉందని ఐ.సి.ఎం.ఆర్. ఎక్స్పర్ట్స్ తెలిపారు.

Part1 2 Copy

Part1 3

21 రోజుల లాక్ డౌన్ సక్సెస్ అయిందని ప్రభుత్వం చెబుతున్నా.. గణాంకాలు మాత్రం వాటికి విరుద్ధంగా ఉన్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ను మే 3, 2020 వరకూ పొడిగించారు. ఏప్రిల్ 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ లో 550 కేసులు ఉన్నప్పుడే భారత్ లో లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి అవ్వకుండా చర్యలు చేపట్టామని.. సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.

ఏప్రిల్ 11 న హెల్త్ మినిస్ట్రీ లాక్ డౌన్ సక్సెస్ అయ్యిందంటూ గ్రాఫ్ ను విడుదల చేసింది. లాక్ డౌన్, ప్రభుత్వం తీసుకున్న మరిన్ని చర్యల కారణంగా కోవిద్-19 కేసులు ఏప్రిల్ 10 నాటికి 7477 మాత్రమేనని.. లేకపోయుంటే 208000 ఉండేవని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

Part1 4

గ్రాఫ్ విషయంలో నిపుణులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోవిద్-19 విషయంలో టెస్టులు అతి తక్కువగా చేస్తున్న దేశాల్లో భారత్ ఉందని.. అందుకే నంబర్ల విషయంలో సరైన క్లారిటీ లేదని పలువురు ప్రముఖులు తెలిపారు.

ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో చాలా తప్పులు ఉండే అవకాశం ఉందని.. ఎందుకంటే ఏప్రిల్ నెల సగం గడుస్తున్నా కూడా చేస్తున్న టెస్టులు అతి తక్కువ అని నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సుందరరామన్ తెలిపారు.

ఇటీవలి కాలంలో ప్రభుత్వం టెస్టింగ్ రేట్ ను పెంచింది. మెట్రోపాలిటన్ నగరాల్లో రోజురోజుకీ కంటైన్మెంట్ జోన్స్, హాట్ స్పాట్లు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల్లో కోవిద్-19 ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటున్నాయి.

లాక్ డౌన్ కారణంగానూ, సామాజిక దూరాన్ని పాటించడం కారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ చైన్ ను తుంచివేయడాన్ని మెడికల్ గా చెప్పలేమని భారత ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన వారానికి, మార్చి 31 న సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది. పలువురు నిపుణులతో చర్చించి, వైరస్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో లాక్ డౌన్ ను అమలు చేశామని తెలిపింది.

టెస్టింగ్ చేయడానికి ఉన్నది తక్కువ సదుపాయాలని తెలుస్తోంది. అది కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలను చూసి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు కారణమైన ఆధారాన్ని వెతికే పనిలో ప్రభుత్వం ఉంది. చాలామందికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం కనిపెట్టలేకపోతోంది.

ఐ.సి.ఎం.ఆర్. ఏమి చెబుతోంది:

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయడం అత్యంత ప్రమాదకరం. లాక్ డౌన్ ను ఎత్తివేస్తే వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉంటుందని ఐ.సి.ఎం.ఆర్. తన డ్రాఫ్ట్ లో వెల్లడించింది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటింటికీ వెళ్లి కరోనా లక్షణాలు ఏవైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవాలని, పెద్ద ఎత్తున క్వారెంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.

ఢిల్లీ ఇన్ఫెక్షన్ డేటాను పరిగణలోకి తీసుకుని లాక్ డౌన్ కారణంగా వైరస్ ప్రభావం తగ్గిందని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ ను అమల్లోకి చేయకుండా ఉండి ఉంటే కోవిద్-19 పాజిటివ్ కేసులు 1.3 మిళియన్లను తాకి ఉండేదట. కోవిద్-19 వ్యాప్తి వెంటనే జరగకుండా లాక్ డౌన్ అన్నది ఆపగలిగిందని తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 నుండి మరోసారి పొడిగించారని. దీని వలన కూడా కోవిద్-19 వ్యాప్తి మరింత తగ్గే అవకాశం ఉందని.. ఇది చాలా ఛాలెంజింగ్ తో కూడుకున్నదని ఐ.సి.ఎం.ఆర్. తెలిపింది. వైరస్ సోకడాన్ని ఆపాలంటే ముందుగానే క్వారెంటైన్ లో ఉండిపోవడం. కేవలం కోవిద్-19 పాజిటివ్ వాళ్ళను క్వారెంటైన్ లో పెట్టడం కంటే.. ఎవరికైనా లక్షణాలు కనిపించగానే సొంతంగా క్వారెంటైన్ ను తీసుకోవడం మంచిదని తెలిపింది. ఐ.సి.ఎం.ఆర్. శాస్త్రవేత్తలు 'కమ్యూనిటీ బేస్డ్ టెస్ట్ అండ్ క్వారెంటైన్' పద్దతిని పాటించడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. ఎవరికైతే లక్షణాలు కనిపించాయో వారిలో రెండో వ్యక్తి 48 గంటల్లో క్వారెంటైన్ లోకి వెళ్లిపోవడం.. నలుగురిలో ముగ్గురు వ్యక్తులు నాలుగు రోజుల వ్యవధిలో క్వారెంటైన్ కు వెళ్ళిపోతే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఐ.సి.ఎం.ఆర్. శాస్త్రవేత్తలు అంటున్నారు.

కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం కేవలం లక్షణాలు ఉన్నవారికి మాత్రమే క్వారెంటైన్ లోకి తరలిస్తోంది. స్వచ్ఛందంగా తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెబుతున్న వారిని మాత్రమే క్వారెంటైన్ లలో ఉంటున్నారు. టెస్టింగుల సంఖ్యను పెంచాలని, నిఘా కూడా ఎక్కువగా పెంచాలని ఐ.సి.ఎం.ఆర్. శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తున్నారు. లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్న ప్రాంతంలోని ప్రతి ఇంటిలోనూ టెస్టులు నిర్వహించాలి.

లాక్ డౌన్ కారణంగా చైన్ ను బ్రేక్ చేయడం అన్నది కుదరదని కూడా ఐ.సి.ఎం.ఆర్. శాస్త్రవేత్తలు అంటున్నారు. పాల్ చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వానికి కేవలం సదుపాయాలను ఏర్పాటు చేసుకోడానికి సమయం ఇచ్చినట్లే. టెస్టింగ్ సెటప్ లను ఏర్పాటు చేయడం.. ఆసుపత్రుల్లో బెడ్స్ వంటివి వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలి.

Part1 5

ఇప్పటి దాకా లాక్ డౌన్ ను బలవంతగా నిర్వహిస్తూ వస్తున్నారు. పోలీసుల పకడ్బందీ చర్యలతో అమలవుతోంది. నాలుగు గంటల వ్యవధిలో లాక్ డౌన్ ను ప్రవేశపెట్టడం కారణంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తిండి లేక ఉండడానికి స్థలం లేక ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు.

ఇదంతా చేస్తోంది వైరస్ ప్రబలకుండా అని ప్రభుత్వం ఓ వైపు చెప్పుకుంటూ వస్తోంది. కోవిద్-19 లక్షణాలు ఉన్న వాళ్ళను 48 గంటల్లో కనిపెట్టాలంటే ప్రభుత్వం కూడా తమ వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, సర్వేలైన్స్, టెస్టింగ్, క్వారెంటైన్ వంటి విషయాల్లో చాలా ఎక్కువ మార్పులు రావాల్సిందే..!

ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. భారత ప్రధాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు వేగవంతంగా తీసుకోకతప్పదని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదంటూ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని మాట్లాడారు. గత అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయమే సరైనదని, ఇప్పుడు వెళుతున్న దారి సరైనదని అన్నారు. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ వంటివి పాటించడం కారణంగా భారత్ లో వైరస్ ప్రభావం తగ్గిందన్నారు. భారత్ లో లక్ష కు పైగా బెడ్స్ ఉన్నాయి.. 600 ఆసుపత్రులు రెడీగా ఉన్నాయన్నారు.

- నితిన్ సేథి - కుమార్ సంభ‌వ్ శ్రీ వాస్త‌వ‌

Next Story