లాక్ డౌన్ ఎఫెక్ట్.. కండోమ్‌లకు యమ గిరాకీ!
By Newsmeter.Network Published on 28 March 2020 10:13 AM ISTఎప్పుడూ ఉద్యోగాలు, ఆఫీస్ పనులు, వ్యాపార పనులు, ఇతర పనుల నిమిత్తం బిజీగా ఉండే ప్రజలు లాక్ డౌన్ పేరుతో ఇండ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వారం రోజులకుపైగా ఇండ్లకే పరిమితం కావడం, మరో 20రోజుల వరకు ఇండ్లలోనే ఉండాల్సి వస్తుండటంతో పలువురు ఇబ్బందులు పడుతున్నా.. సగానికిపైగా దంపతులు హ్యాపీగా ఉన్నారంట. ఇటీవలే పెళ్లైన వారు, నడివయస్కులు ఇంట్లోనే ఖాళీగా ఉండలేక కామకలాపాల్లో బిజీగా గడిపేస్తున్నారంట. దీంతో ఇండియాలో కండోమ్‌లకు యమ గిరాకీ పెరిగిందని తెలుస్తోంది. ఇటీవల ఓ జాతీయ వార్తా సంస్థ ఈ విషయంపై కథనాన్ని ప్రచురింది. ఇండియాలో ఇటీవల ఎన్నడూలేని స్థాయిలో కండోమ్‌లు విక్రయాలు బాగా పెరిగాయని ఈ కథనం సారాంశం.
Also Read :కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారా?
మామూలు సమయాల్లో పురుషులు ఆఫీసులని, వ్యాపార పనులని ఎక్కువ బయటనే గడపాల్సి వచ్చేది. ఇండ్ల పట్టున ఉండేది కొద్దిసేపే. ఉద్యోగాలు చేసే పలువురు స్త్రీలదిసైతం అదే పద్ధతి. ఇక దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే వీరికి తీరిక దొరకడం కొంత కష్టమే. ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకొని ఓపిక లేక నిద్రలోకి జారుకుంటారు. దీంతో పలువురి దంపతుల దాంపత్యం జీవితంలో విబేధాలు చోటు చేసుకుంటూ విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ విధించడంతో.. తప్పనిసరిగా అందరూ ఇండ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఎటైనా బయటకు పోదామన్నా పోలీసులు తరిమేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలు, కుటుంబ సభ్యులతో పొదస్తుమానం ఇంట్లోనే కాలక్షేపం చేయాలి.
Also Read :ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి అభినందనలు
ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఇటీవల పెళ్లైన వారు, నడివయస్కులు అధికశాతం మంది మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వీరు శృంగారంలో మునిగితేలుతుండటంతో.. దేశంలో కండోమ్‌లకు భలే గిరాకీ పెరిగినట్లు ఓ జాతీయ వార్త కథనం పేర్కొంది. వారం రోజుల్లోనే సాధారణ స్థాయిల్లో కంటే ఎక్కువ కండోమ్‌లు దేశంలో అమ్ముడుపోయాయని రిపోర్టుల్లో సైతంవెల్లడవుతున్నాయి. భారత దేశంలో శృంగారాన్ని ఒక బూతుగా చూసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి పరిణామమేనని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విధంగా శృంగారంలో పాల్గొనడం వల్ల భార్యభర్తల మధ్య బంధం మరింత పెరగడంతో పాటు, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఖాళీ సమయాల్లో ఆఫీస్ టెన్షన్, ఉద్యోగం టెన్షన్, వ్యాపారం టెన్షన్‌లు ఏమీ ఉండవని, ఈ సమయంలో సుఖవంతమైన శృంగారంలో పాల్గొనడం ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండే దంపతులకు రిలీఫ్‌ను ఇస్తుందని, నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. మొత్తానికి కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తున్నా.. లాక్‌డౌన్ సమయంలో అధికశాతం మంది దంపతులకు మాత్రం తీపిగుర్తులను మిగుల్చుతుందనే చెప్పవచ్చు.