కీలక నిర్ణయం: ఏపీలో లాక్‌డౌన్ సడలింపులు
By సుభాష్ Published on 11 May 2020 9:09 AM ISTఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై మరింత ఆందోళన వ్యక్త అవుతోంది. ఇప్పటికే లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇక తాజాగా లాక్‌డౌన్ నుంచి కొన్ని విభాగాల్లో సడలింపులు ఇవ్వనుంది. కంటైన్‌మెంట్, బఫర్ జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ వెసులుబాటు మరింత పెంచాలని భావిస్తోంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దుకాణాలు తెరిచేలా, అలాగే సరి-బేసి సంఖ్యలో దుకాణాలను విభజించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిమిత సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లేవారికి అనుమతించే అంశంపై కూడా పరిశీలిస్తున్నారు అధికారులు.
కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదాంతం తర్వాత కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినతరం చేస్తూ, ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు సూమారు 50కిపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.