మే 18 నుంచి లాక్‌డౌన్ 4 : ప్రధాని మోదీ
By సుభాష్ Published on 12 May 2020 4:24 PM GMTమే 18 నుంచి లాక్‌డౌన్ 4.0 గురించి మే 18వ తేదీ నాటికి ప్రకటిస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త నిబంధనలతో నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుందని అన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వీకరిస్తారన్నారు. కరోనా వైరస్ దీర్ఘకాలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలను చూస్తుంటే మరోసారి లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా వైరస్ కోసం ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ కరోనాపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించడం వల్ల మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని, లేకపోతే మరింత ప్రమాదంలో ఉండేవారని అన్నారు. ఈ సంక్షోమం మనకు ఒక కీలక దశగా మారాలని ప్రజలకు సూచించారు. కరోనాను ఎదుర్కొవడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమన్నారు.
కాగా, సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్ అమలు, కరోనా కేసుల సంఖ్య తదితర అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ పొడిగించాలా..? వద్దా అనే అంశం రాష్ట్రాలకే వదిలేశారు. మే 15 వరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టు సమర్పించాలని, రిపోర్టును పరిశీలించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఈ రోజు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.