Fact Check : గాల్వన్ లోయలో చనిపోయిన చైనా సైనికుల లిస్టు బయటకు వచ్చిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 4:22 PM IST
Fact Check : గాల్వన్ లోయలో చనిపోయిన చైనా సైనికుల లిస్టు బయటకు వచ్చిందా..?

గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవల్లో భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించారు.. చైనా సైనికులు కూడా ఎక్కువగా చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. గత కొద్దిరోజులుగా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లలో 55 మంది చైనా సైనికులు చనిపోయారని.. వారికి సంబంధించిన పేర్లు వైరల్ అవుతున్నాయి.

C1

C2

చైనా సైనికులు కొన్ని శవపేటికలను మోసుకువెళుతున్న ఫోటోలు, సైనిక వందనం చేస్తున్న ఫోటోలు కూడా ఈ లిస్టుకు కలిపి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. వీటన్నిటినీ చూసి ప్రజలు నిజమేనని నమ్ముతున్నారు.

C3

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటో పైన చైనీస్ భాషలో రాసి ఉంచారు. ఆ రెండు లైన్స్ ను గూగుల్ లెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేయగా.. “We express our deepest condolences to our families and are firmly committed to protecting the sovereignty and integrity of the country”. అని అర్థమని తెలిపింది. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని అందులో రాసుకుని వచ్చారు.

ఆ లిస్టులో ఉన్న పేర్లకు సంబంధించి ఎటువంటి క్లూ లభించలేదు.

గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినా సరైన ఫలితాలు లభించలేదు. దీంతో ఆ ఫోటోలో ఉన్న పేర్లను గూగుల్ లో సెర్చ్ చేయగా.. వారంతా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాకు చెందిన జనరల్స్.

C5

55 నేమ్స్ సెర్చ్ చేయగా అందరి పేర్లు వికీపీడియా లింక్ లో చూడొచ్చు.

https://en.wikipedia.org/wiki/List_of_generals_of_the_People's_Republic_of_China.

వికీపీడియా పేజ్ లోకి వెళ్లి జనరల్స్ పేర్లను తీసుకుని ఈ ఫొటోలో లిస్ట్ లా తయారుచేశారు. 32 సీనియర్ జెనరల్స్ 1955 లో అపాయింట్ అవ్వగా, 19 జనరల్స్ జూన్ 8, 1994 న జాయిన్ అయ్యారు. జూన్ 7, 1993 న మిగిలిన 5 జనరల్స్ అపాయింట్ అయ్యారు. కేవలం వికీ పీడియా పేజ్ లోకి వెళ్లి వాళ్ళ పేర్లను కాపీ చేసి ఈ లిస్టు తయారుచేశారు.

55 మంది చైనీస్ సైనికుల పేర్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది 'పచ్చి అబద్ధం'.

చైనా సైనికులకు సంబంధించిన ఫోటోల గురించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 1950-53 లో కొరియన్ వార్ లో చనిపోయిన సైనికులను ఏప్రిల్ 4, 2019న ఖననం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా భద్రపరిచిన 10 మంది సైనికుల మృతదేహాలను చైనా స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో తీసిన ఫోటోలను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

NX News, China Xinhua News ఫేస్ బుక్ పేజీలలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. పలు లింక్ లలో ఈ ఫోటోలను చూడొచ్చు.

http://www.nxnews.net/tp/tjxw/201904/t20190404_6248748.html?spm=zm5078-001.0.0.1.PU4Pih

“The remains of 10 Chinese soldiers who were killed in 1950-53Korea war were buried on Thursday (yesterday) in China after being restored from the Republic of Korea (RoK)”. అని ఆ ఫేస్ బుక్ పేజీలో ఏప్రిల్ 5, 2019లో రాసుకుని వచ్చారు.

షెన్యాంగ్ లోని డెడ్ పార్క్ లో మరణించిన సైనికులకు తుది వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మిలటరీ లీడర్స్, కొరియా వార్ లోని వెటరన్స్, వారి కుటుంబాలు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డైరెక్టర్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ వెటరన్స్ సోల్జర్స్ 'క్వియాన్ ఎంగ్' మాట్లాడుతూ సైనికులు చేసిన త్యాగాలను మరువలేమని అన్నారు.

55 మంది చైనా సైనికుల లిస్టు, వారి అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫోటోలు 'పచ్చి అబద్ధం'.

Claim Review:Fact Check : గాల్వన్ లోయలో చనిపోయిన చైనా సైనికుల లిస్టు బయటకు వచ్చిందా..?
Claim Fact Check:false
Next Story