మ‌ద్యం ప్రియుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం షాకిచ్చింది. మద్యం ధరలు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు తెలిపి మ‌ద్యం ప్రియుల‌పై భారం వేసింది. బాటిల్‌ సామర్థ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.80, బీర్ల‌పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచుతున్న‌ట్లు ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

ఈ మేరకు పెరిగిన ధరల పట్టికను సోమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. పెరిగిన మ‌ద్యం ధరలు 18వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి. పాత నిల్వలకు పెరిగిన ధ‌ర‌లు వర్తించవ‌ని సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. అయితే పెరిగి మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనున్న‌ట్లు స‌మాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.