డ్యూటీ ఫ్రీ వస్తువులకు భారీ కోత

By అంజి  Published on  20 Jan 2020 5:00 AM GMT
డ్యూటీ ఫ్రీ వస్తువులకు భారీ కోత

ముఖ్యాంశాలు

  • డ్యూటీ ఫ్రీ వస్తువుల విలువను తగ్గించిన ప్రభుత్వం
  • విదేశాల నుంచి తెచ్చే గూడ్స్, గిఫ్ట్స్ రూ.50,000 మాత్రమే
  • సిగరెట్ల మీద భారీ కోత విధించే ఆలోచన
  • అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మార్పులు చేర్పులు
  • ఈ కామర్స్ సంస్థలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం
  • భారతీయ రిటైల్ ఔట్ లెట్లను రక్షించే ప్రయత్నం

ఢిల్లీ: విదేశాల నుంచి వచ్చేటప్పుడు డ్యూటీ ఫ్రీ ఔట్ లెట్లలో కొని తెచ్చుకునే వస్తువుల విలువను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కేవలం ఒకే ఒక్క లిక్కర్ బాటిల్ ని మాత్రం తెచ్చుకోవడానికి అనుమతిస్తారు. సిగరెట్లమీదకూడా భారీ కోత విధించారు. అబ్రాడ్ నుంచి తెచ్చుకునే గూడ్స్, గిప్ట్స్ విలువను కేవలం రూ.50 వేలకు పరిమితం చేస్తున్నారు. ఇంతకు ముందు 200 సిగరెట్లను తెచ్చుకోవడానికి అనుమతించేవాళ్లు. ఇప్పుడా సంఖ్య 100. ఇకపై దానిలోకూడా భారీగా కోత విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ అన్ని వైపులనుంచీ తీవ్రస్థాయిలో వ్యతేరేకత వ్యక్తం అవుతోంది.

విదేశాలనుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయాల్లో ఉన్న డ్యూటీ ఫ్రీ షాపుల్లో మద్యం సీసాలను, సిగరెట్లను, గిఫ్ట్ లను కొని తెచ్చుకోవడం ప్రయాణికులకు అలవాటు. అలా తెచ్చుకోవడంవల్ల ధర తక్కువ ఉండడమే కాకుండా నికార్సైన వస్తువులు దొరుకుతాయని ప్రయాణికుల నమ్మకం. అది పూర్తిగా నిజం కూడా. ఈ ప్రతిపాదనలు నిజమేనని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకే కోత విధిస్తున్నామని ఆయన చెబుతున్నారు.

డ్యూటీ ఫ్రీ వస్తువులను తెచ్చుకునే విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తే భారత్ ఇప్పటివరకూ రెండు లీటర్ల మద్యాన్ని తెచ్చుకోవడానికి అనుమతిస్తోంది. అదే అమెరికా అయితే కేవలం ఒక్క లీటర్‌, చైనా ఒకటిన్నర లీటర్ మద్యాన్ని తెచ్చుకోవడానికి అనుమతిస్తోంది. 12 శాతం ఆల్కహాల్ ఉన్న ప్రాడక్ట్ విషయంలో చైనా నిబంధనలు ఇవి. సౌత్ కొరియా అయితే 1 లీటర్ మద్యం లేదా $400 లిమిట్ పెట్టింది.

రిటైల్ ఔట్ లెట్ల కోసమే..

టొబాకో ప్రాడక్ట్స్ విషయంలో అయితే భారత్ 100 సిగరెట్లు లేదా 25 సిగార్లు, 125 గ్రాముల టొబాకోని అనుమతిస్తోంది. సింగపూర్ మొత్తం అన్ని టొబాకో ఉత్పత్తులమీదా డ్యూటీ విధిస్తోంది. ఆస్ట్రేలియా 25 సిగరెట్లు లేదా సిగార్స్ ని, న్యూజీల్యాండ్ 50 సిగరెట్లు లేదా సిగార్స్ ని, 50 గ్రాముల టొబాకోను డ్యూటీ లేకుండా అనుమతిస్తున్నాయి.

ఈ కామర్స్ కంపెనీలకు సంబంధించిన అనేక విధాలైన అవకతవకలపై దృష్టి సారించాలని భారత వాణిజ్య శాఖ నిర్ణయించింది. వీటివల్ల విపరీతంగా ఉద్యోగాలు పోవడం, రిటైల్ ఔట్ లెట్లు మూత పడడం లాంటి ఇబ్బందులు బాగా పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని వాణిజ్య శాఖ మంత్రి చెబుతున్నారు.

మన దేశంలో మరో బిలియన్ డాలర్లు అంటే వంద కోట్ల రూపాయల్ని పెట్టుబడి పెట్టాలన్న అమెజాన్ నిర్ణయం స్థానిక మార్కెట్లకు విఘాతాన్ని కలిగించేదిగా ఉందన్న వ్యతిరేకత సర్వత్రా వ్యక్తమయిన నేపథ్యంలో వాణిజ్య శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కామర్స్ వ్యాపారాల వల్ల నేరుగా మార్కెట్ కి వెళ్లి కొనుక్కోవాలనుకునేవారి సంఖ్య బాగా తగ్గిపోతోందనీ, దానివల్ల మన రిటైల్ ఔట్ లెట్లకు, వ్యాపారులకు భారీగా నష్టం వాటిల్లుతోందని పీయూష్ గోయెల్ అంటున్నారు. గడచిన ఏడాది ఈకామర్స్ వ్యాపారాల వల్ల భారతీయ మార్కెట్లకు రూ. 6,000 కోట్ల నష్టం వాటిల్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Next Story