మామిడి పండ్లను తినేముందు ఇలా చేయండి

మామిడి సీజనల్ పండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ పండ్లను తినేందుకు అందరూ ఇంట్రెస్ట్‌ చూపుతారు.

By అంజి  Published on  21 April 2024 1:45 PM IST
mangoes, health tips, Summer

మామిడి పండ్లను తినేముందు ఇలా చేయండి

మామిడి సీజనల్ పండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ పండ్లను తినేందుకు అందరూ ఇంట్రెస్ట్‌ చూపుతారు. అందుకే పండ్లలో రారాజుగా 'మామిడి పండు' పేరు తెచ్చుకుంది. మామిడి పండ్లను కొని ఇంటికి తెచ్చిన వెంటనే చాలా మంది తినాలని ఆశపడతారు. అయితే మామిడి పండ్లను తినే ముందు, మామిడిపండ్లకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది. మామిడి పండును తినే ముందు నీళ్లల్లో కొద్దిసేపు నానబెట్టడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మామిడిలో ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది.

పండ్లను నీటిలో నానబెట్టకుండా నేరుగా తింటే ఆ ఫైటిక్ ఆమ్లం శరీరంలోకి చేరి అదనపు వేడికి కారణం అవుతుంది. నీటిలో పండు ఎంతసేపు నానితే అందులోని వేడి అంతలా తగ్గుతుంది. అందుకే తినాలి అనుకునేటప్పుడు ఓ 30 నిమిషాల ముందు పండ్లను నానబెడితే అవి తిన్న తర్వాత కూడా ఎలాంటి వేడి చేయదంటున్నారు నిపుణులు. నీళ్లలో నానబెట్టడం వల్ల మామిడి తొక్కపై ఉన్న నూనె, సూక్ష్మక్రిములు, ఒక వేళ వాటిపై ఏమైనా రసాయనాలు పిచికారీ చేసినా వాటి అవశేషాలు కూడా తొలగిపోతాయి. మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే వాటిని తినేముందు కచ్చితంగా కాసేపు నీళ్ళల్లో నానబెట్టాలి. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి సహజమైన తీపి, సమ్మేళనాలు తిరిగి పొందొచ్చు.

Next Story