వయసు పెరిగే కొద్దీ బ్యాక్‌ పెయిన్‌ ఎందుకు వస్తుందంటే?

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంటాయి.

By -  అంజి
Published on : 4 Oct 2025 12:10 PM IST

back pain, age, Lifestyle, Health Tips

వయసు పెరిగే కొద్దీ బ్యాక్‌ పెయిన్‌ ఎందుకు వస్తుందంటే?

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంటాయి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారికి వెన్నెముకలోని డిస్క్‌ల మధ్య లిక్విడ్‌ తగ్గడం, డిస్క్‌లు అరగడం కారణంగా బ్యాక్‌ పెయిన్‌ వస్తుంది. సరైన పోషకాహారం తీసుకోనివారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.. ముఖ్యంగా పిరుదులు, తుంటి కండరాల నొప్పి, ఉదయం లేవగానే వెన్నునొప్పి, వెన్నుమొద్దు బారినట్టు ఉండటం, కాళ్లు, పాదాల వెనుక భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ నొప్పి కొన్ని గంటల పాటు ఉండి తగ్గిపోతుంది.

అలా కాకుండా 72 గంటల కంటే ఎక్కువసేపు ఇబ్బంది పెడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ఎక్కువ సేపు కుర్చీలో కుర్చొని పని చేయడం, కూర్చునేటప్పుడు సరైన విధంగా కూర్చోకపోవడం, మన సామర్థ్యానికి మంచి బరువులు ఎత్తడం, స్త్రీలు ఎత్తుమడం చెప్పులు ఎక్కువ రోజుల పాటు ఎక్కువ సమయం వేసుకోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటివి వెన్నునొప్పికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. వెన్నులో డిస్క్‌ చుట్టూ ఉన్న మృదలాస్థి ఎముకలు, నరాలకు ఒత్తడి జరిగినప్పుడు కూడా నడుం నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Next Story