నెలసరిలో చాలా మందికి పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో పాటు నడుంనొప్పి కూడా వస్తుంది. మరి ఈ సమయంలో నడుం నొప్పికి కారణాలు ఎంటో తెలుసుకుందాం..
నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయ లైనింగ్ తొలగించి, గర్భాశమ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు అంటున్నారు.
గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటెరైన్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి కూడా నడుం నొప్పికి దారి తీస్తాయి. పీరియడ్స్‌లో నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే హీటింగ్ ప్యాడ్‌ను నడుముపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. సరైన భంగిమలో కూర్చోవడం, నిలబడటం చేయాలి. అలాగే ఈ సమయంలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.