డయాబెటిస్ అదుపులో లేకపోతే అంతే..

ఇండియాలో రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వారి జీవితంలో ఉన్న హడావుడి కారణంగా.. చాలా మంది షుగర్

By -  అంజి
Published on : 2 Jan 2026 6:20 PM IST

diabetes, diabetes controlled, diabetes description, Lifestyle, Health Tips

డయాబెటిస్ అదుపులో లేకపోతే అంతే.. 

ఇండియాలో రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వారి జీవితంలో ఉన్న హడావుడి కారణంగా.. చాలా మంది షుగర్ పేషెంట్లు సమయానికి మందులు వేసుకోరు. దీని వల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇలా జరిగితే చాలా రోగాలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్లు. షుగర్ లెవెల్స్‌ని ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అసలు బాడీలో షుగర్ ఎక్కువైతే ఏం జరుగుతుంది ? దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎలా ?

షుగర్ లెవెల్స్ పెరిగితే ఏం జరుగుతుంది ?

బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే ఆ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాల మీద పడుతుంది. ముఖ్యంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ప్రమాదకర ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. కిడ్నీ ఫెయిల్, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. షుగర్ లెవెల్స్ పెరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సమయానికి మందులు తీసుకుంటూ.. సరైన డైట్ పాటించాలని చేయాలని చెప్తున్నారు.

అసలు డయాబెటిస్‌ని గుర్తించడం ఎలా ?

డయాబెటిస్‌ని కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారిలో అతిగా దాహం వేయడం, అతిగా ఆకలి వేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటి చూపు సమకబారుతుంది. చిన్న చిన్న పనులకు తీవ్రంగా అలసిపోతుంటారు. ఏకాగ్రత ఉండదు. ఏ పనిలోనూ ఉత్సాహం, చురుకుదనం లేకుండా పని చేస్తుంటారు. డయాబెటిస్ ఉన్నవారికి గాయం తగిలితే తొందరగా మానిపోదు. చాలా రోజుల వరకూ అలాగే ఉంటుంది. మీలో గనక ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.

డయాబెటిస్ ఎందుకు వస్తుంది ?

డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. అవి టైప్1, టైప్2. ప్రస్తుతం చాలా మందిని ఎటాక్ చేస్తున్నది టైప్2 డయాబెటిస్. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, అతిగా భావోద్వేగాలకు గురి కావడం, మానసిక ఆందోళనల వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక టైప్1 డయాబెటిస్ ఎక్కువగా వంశపారర్యంగానే వస్తుంది. అలాగే క్లోమ గ్రంథి సరిగ్గా పని చేయకపోయినా వస్తుంది. టైప్1తో పోలిస్తే ప్రపంచంలో ఎక్కువ మంది టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. కారణం ఏదైనా డయాబెటిస్ మన దరికి రాకుండా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు. మీ రోజూ వారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్.

Next Story