నోటి దుర్వాసన దూరం కావాలంటే.. ఇలా చేయండి

నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు, పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు వస్తాయి.

By అంజి  Published on  8 Oct 2024 10:30 AM IST
health tips, bad breath, Lifestyle

నోటి దుర్వాసన దూరం కావాలంటే.. ఇలా చేయండి

నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు, పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. దీని నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు ట్రై చేయండి.

ఉదయం బ్రష్‌ చేయగానే ఒక గ్లాస్‌ నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది.

నోటి దుర్వాసన సమస్య ఉంటే రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మూత్రం రూపంలో మలినాలు తొలగిపోతాయి. అలాగా నోరు కూడా డ్రై అవ్వకుండా ఉండి దుర్వాసన తగ్గుతుంది.

కొబ్బరి, ఆలివ్‌, నువ్వుల నూనెల్లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఒక లేబుల్‌ స్పూన్‌ నూనె నోట్లో వేసుకోవాలి. సుమారు 15 నిమిషాల పాటు నోట్లోని ప్రతి మూలకు వెళ్లేలా పుక్కిలించాలి. నూనెను మింగకూడదు. 15 నిమిషాల తర్వాత ఉమ్మివేయాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసనతో పాటు చిగుళ్లలో రక్తస్రావం, వాపు తగ్గుతాయి.

ఆవననూనెలో ఉప్పు కలిపి వేళ్లతో చిగుళ్లును బాగా మసాజ్‌ చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు మెరుస్తాయి.

పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

Next Story