ఓట్స్‌తో చేసే వంటకాలు షుగర్ పేషెంట్లకు మంచివి. రకరకాల వెజిటెబుల్స్‌తో ఓట్స్ ఉప్మా తింటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. నీళ్లలో ఉడికించిన ఓట్స్, పాలు, నట్స్ కలుపుకుని తిన్నా చాలా మంచిది. ఓట్స్ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మాలో ఉండే ఫైబర్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం వంటివి మధుమేహులకు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి.
పెసరట్టు తినొచ్చు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. డయాబెటిస్ రోగులు ఉదయం పూట రాగి దోశ, రాగి జావ తాగితే ఎముకలు బలంగా మారుతాయి. అలాగే నీరసం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు గుడ్లు తినడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటి లేదా రెండు గుడ్లు తింటే మంచిది.
ఉదయం గ్రీన్ టీ, హెర్బల్ టీ, నీళ్లు తాగడం ప్రయోజనకరం. ఇడ్లీ, బియ్యపు పిండితో చేసే దోశ, బోండా వంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక కేలరీలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. శరీరానికి అవసరమైన మేరకు నీరు తాగాలి. కూల్‌డ్రింక్స్, షుగర్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.