'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం. శరీర అవసరాలకు సరిపడా నీరు అందకపోవడం వల్ల వేడి చేసినట్టు లక్షణాలు కనిపిస్తాయి. అంతేతప్ప కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే వేడి చేస్తుందనేది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ వేడి తగ్గాలంటే శరీర అవసరాలకు తగినంత నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.
లక్షణాలు: మూత్ర విసర్జన సమయంలో మంట, ఎసిడిటీ, అరిచేతులు, కాళ్లు, కళ్లల్లో మంట, మొటిమల సమస్య, చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, నోటిపూత, గొంతులో తడి ఆరిపోవడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనత, మూత్రాశయం, కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వేడి తగ్గాలంటే: శరీరానికి అవసరమైన మేర నీరు తాగాలి. ప్రైలు, అల్లం, మసాలాలు, ఊరగాయ, పులుపు లాంటి పదార్థాలు వేడిని పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుదీనా, పుచ్చకాయ, దోసకాయ, మెంతులు, నిమ్మరసం, ఉల్లిపాయం, కర్బూజ, దానిమ్మ వంటివి తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.