మల విసర్జన అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం మల విసర్జనకు వెళ్లాలని శరీరం సంకేతాలు పంపుతన్నప్పటికీ, పరిస్థితుల ప్రభావం కారణంగానో లేదా ఇంకేదైనా సమస్య వల్లో వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మల విసర్జన చేయటం ఆపుకుంటే బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధి రావడంతో పాటు పేగుల్లో చిన్న రంధ్రాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మన శరీరంలో అలానే ఉండిపోతాయి. తర్వాత అవి కుళ్లిపోయి వాటి నుంచి గ్యాస్, మెటబోలైట్స్ అనే కెమికల్స్ ఉత్పత్తి అయ్యి, అవి పేగుల్లోని గోడలను దెబ్బతీస్తాయి. వీటితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మలవిసర్జన విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.