ఉల్లికాడలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
భారతీయ వంటకాలలో ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది.
By అంజి Published on 5 Jun 2024 4:30 PM ISTఉల్లికాడలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
భారతీయ వంటకాలలో ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే మన పెద్దలు ఒక్క మాటలో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అన్నారు. అయితే.. ఈ ప్రయోజనాలు ఉల్లిపాయలతోనే కాదు.. దాని కాడలతో కూడా కలుగుతాయి.
వంటకు రుచిని అందించే ఉల్లికాడలు ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి. ప్రతి రోజూ వంటల్లో ఉలికాడలను ఉపయోగించడం మంచిది. వీటిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని వృద్ధ్యాప్యానికి గురికాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు పోషకాలు మెండుగా ఉండే వీటివల్ల బోలేడు ప్రయోజనాలు ఉన్నాయి.
ఉల్లికాడల్లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. అలాగే వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పరిరక్షిస్తాయి. దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఈ కాడల సూప్ ఉపశమనాన్ని అందిస్తుంది.
ఎముకల బలహీనతను అధిగమించాలంటే తరచూ ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని కాల్షియం, కె విటమిన్ ఎముకలను బలంగా ఉంచుతాయి. ఉల్లికాడల్లోని పీచు, జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. దీని వల్ల మలబద్ధక సమస్య ఉండదు.
ఈ కాడల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని అమినోయాసిడ్స్ చర్మ కణాల ఉత్పత్తికి దోహదపడతాయి. సాగే గుణాన్ని, తేమని అందిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా ఉంచడం వల్ల త్వరగా వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు.