మెంతి కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఆకు కూరలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటి వల్ల చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
By అంజి Published on 6 Oct 2024 4:36 AM GMTమెంతి కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఆకు కూరలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటి వల్ల చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది. వీటిలో శరీరానికి అవసరమైన భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, కాల్షియం, ఇనుము ఇంటి ఖనిజ లవణాలు, ఎ,బి,సి,కె వంటి విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. వాతావరణ పరిస్థితుల వల్ల అనేక ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి మెంతి కూర చక్కని పరిష్కారమని నిపుణలు చెబుతున్నారు.
ప్రయోజనాలు:
మెంతి కూరలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్లు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ,బీ,సీ,డీలు ఉంటాయి.
అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారానికి రెండు సార్లు మెంతి కూర తింటే కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగుల ఆరోగ్యం బాగుంటుంది.
మెంతికూరలో పీచు పదార్థం జీవక్రియను పెంచుతుంది. దీని వల్ల క్యాలరీలు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
మెంతి కూరను ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
మెంతి కూర తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.