బెల్లం కేవలం ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల మరో ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
బెల్లం బీపీని కంట్రోల్ చేస్తుంది. బెల్లంలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. రోజూ బెల్లం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కాలేయానిమి మేలు జరుగుతుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. బెల్లంలోని మాంగనీస్, సెలీనియం శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతాయి. జీర్ణక్రియని మెరుగుపర్చడంలో బెల్లం బాగా పని చేస్తుంది.
బెల్లంలోని మెగ్నీషియం పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగితే ఫ్లూ, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఊపిరితిత్తులు క్లీన్ అయ్యేందుకు కూడా బెల్లం తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఓ బెల్లం ముక్క తినడం వల్ల వాయుకాలుష్యం వల్ల కలిగే రిస్క్ తగ్గుతుందని తగ్గుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అందుకే రోజూ 15 నుంచి 20 గ్రాముల బెల్లాన్ని నేరుగా లేదా టీ లేదా ఇతర ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.