మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

మజ్జిగలో మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మజ్జిగత తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ తగ్గుతుంది.

By అంజి  Published on  23 Oct 2024 9:15 AM IST
health benefits, buttermilk, curd, Lifestyle

మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

చాలా మంది భోజనం చేసేటప్పుడు చివరగా పెరుగుతో ముగిస్తారు. మజ్జిగ తాగడానికి అంత ఆసక్తి చూపరు. మజ్జిగను వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం మాత్రమే తాగుతుంటారు. అయితే రోజూ ఒక గ్లాస్‌ మజ్జిగ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగను ఉదయం లేదా భోజనం తర్వాత తీసుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

మజ్జిగలో మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మజ్జిగత తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ తగ్గుతుంది. రోజూ గ్లాసు మజ్జిగ తాగితే ఎముకల బలం పెరుగుతుంది. దంతాల సమస్య తగ్గుతుంది. మజ్జిగలో తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిది.

మజ్జిగ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. కారం, మసాలా ఉన్న ఆహారం తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో గ్లాసు మజ్జిగ తాగితే కడుపులో మంట తగ్గుతుంది. మజ్జిగ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Next Story