బార్లీ నీళ్లతో చాలా లాభాలు ఉన్నాయ్‌

ఇంట్లో పెద్దలు తాగమని చెబుతున్నా.. చాలా మంది బార్లీ నీటిని పక్కన పెడుతుంటారు. అయితే ఈ బార్లీ నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

By అంజి  Published on  12 Jan 2025 2:30 PM IST
Health benefits, barley water, Life Style

బార్లీ నీళ్లతో చాలా లాభాలు ఉన్నాయ్‌

ఇంట్లో పెద్దలు తాగమని చెబుతున్నా.. చాలా మంది బార్లీ నీటిని పక్కన పెడుతుంటారు. అయితే ఈ బార్లీ నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బీపీ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండల ప్రభావం శరీరంపై ఎక్కువగా పడకుండా, వడదెబ్బ తగలకుండా ఈ నీళ్లు రక్షిస్తాయి. బార్లీ నీళ్లతో జీర్ణాశయం శుభ్రపడుతుంది. అజీర్తి సమస్య దూరం అవుతుంది.

పిల్లలకు బార్లీ నీళ్లు ఇస్తే వారికి మలబద్ధకం వంటి సమస్యలు రావు. గర్భిణులు బార్లీ నీళ్లు తాగితే కాళ్ల వాపు సమస్య తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఈ నీరు ఉపయోగపడుతుంది. మహిళలు రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి.

Next Story