శీతాకాలం.. ఈ పానీయాలతో ఆరోగ్యానికి ప్రయోజనం

మిగిలిన సీజన్‌లతో పోలిస్తే శీతాకాలంలో మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

By అంజి  Published on  20 Jan 2025 11:40 AM IST
health benefits, drinks, winter, Life style

శీతాకాలం.. ఈ పానీయాలతో ఆరోగ్యానికి ప్రయోజనం

మిగిలిన సీజన్‌లతో పోలిస్తే శీతాకాలంలో మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే పానీయాల్లో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టోచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

- శీతాకాలంలో మనం తాగే సూపులు, పాలల్లో కొన్ని మిరియాల పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

- మిరియాలలో ఉండే విటమిన్‌ సి, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు.. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తాయి.

- అల్లం, యాలకులు వేసుకుని ఉదయాన్నే టీ తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే కూరల్లో కూడా అల్లం, యాలకులను భాగం చేసుకోండి. అల్లంలోని ఔషధ గుణాలు గొంతు, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాలకులు రోగ నిరోధకతను పెంచుతాయి.

- దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుని అందులో కాస్త తేనె వేసుకుని తాగితే జీర్ణక్రియ చక్కగా జరగడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Next Story