బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ బెల్లాన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనం జరుగుతుంది. ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
- బెల్లం, నువ్వులను కలిపి ఉండలుగా చేసుకుని తింటే దగ్గు, జలుబు, ప్లూ లక్షణాలు తగ్గుతాయి. ఐరన్, కాల్షియం, లభిస్తుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జుట్టు ఊడే సమస్య తగ్గుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- బెల్లం, నెయ్యిని కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
- బెల్లంతో తయారు చేసిన పల్లీల ఉండలు, అచ్చులు తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లం పల్లీలు చిన్నారుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- బెల్లం, పసుపును కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- బెల్లం, ధనియాలను కలిపి తీసుకుంటే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి సమస్య తగ్గుతుంది.
- బెల్లం, సోంపును కలిపి తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య క్రమంగా దూరం అవుతుంది.