మీ పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపిస్తున్నారా?
పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఈ సూచనలు పాటించాల్సిందే. మీ చిన్నారి మోయగలిగే బ్యాగ్ ఉండేలా చూసి తీసుకోండి.
By అంజి Published on 20 Jun 2024 4:30 PM ISTమీ పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపిస్తున్నారా?
పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఈ సూచనలు పాటించాల్సిందే. మీ చిన్నారి మోయగలిగే బ్యాగ్ ఉండేలా చూసి తీసుకోండి. టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్స్ కలర్‌ఫుల్‌గా, బ్యాగులపై వారికి నచ్చిన బొమ్మలు ఉండేలా చూసుకోవాలి. దీంతో పిల్లలు ఇష్టంగా స్కూల్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. పెన్సిల్స్, నోట్ బుక్స్, వారికి కావాల్సిన స్టేషనరీ ముందే తీసుకోవాలి. చిన్న పిల్లలు స్కూల్‌లో వారి వస్తువులను పోగొట్టుకోవడం కామన్. అన్ని వస్తువులపై వారి పేరుతో కూడిన లేబుల్స్ అంటించండి. దీంతో పోగొట్టుకున్న వస్తువులు త్వరగా దొరుకుతాయి. మీ పిల్లలు వెళ్లే స్కూల్ యూనిఫామ్ ఎలాంటిదో తెలుసుకుని ఒకటికంటే ఎక్కువ జతలు కొనడం మంచిది.
మీ పిల్లలకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే స్కూల్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డిటేల్స్ ఇవ్వాలి. కేర్ టేకర్స్‌తో మాట్లాడండి. పిల్లలను స్కూల్‌లో చేర్పించే ముందు ఒక రోజు స్కూల్‌కు తీసుకెళ్లి చూపించండి. దీంతో స్కూల్ అంటే భయపడకుండా మానసికంగా సిద్ధమవుతారు. ఫ్రెండ్స్‌తో కలిసిపోయేలా, గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా ఎంకరేజ్ చేయండి. ఇప్పటికే స్కూల్‌లో చదువుతున్న పిల్లలు మీకుంటే.. ఈ సమ్మర్‌లో ఆటపాటలతో గడిపి చదవడం, రాయడం మర్చిపోతుంటారు. గతంలో చదివిన బేసిక్స్ గుర్తు చేయండి. రీడింగ్ ప్రాక్టీస్ చేయించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీ పిల్లలు చదువులో ముందంజ వేస్తారు.