Dream Astrology : నూతన సంవత్సరం రోజు ఈ కలలు వస్తే మంచిదట..!
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో కనిపించే దృశ్యాలు కొన్ని నిజ జీవితంలో నిజమవుతాయని అంటారు.
By Medi Samrat Published on 21 Dec 2024 7:36 AM GMTడ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో కనిపించే దృశ్యాలు కొన్ని నిజ జీవితంలో నిజమవుతాయని అంటారు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. మీరు కొత్త సంవత్సరం మొదటి రోజున కొన్ని కలలను కన్నట్లైతే.. ఆ కలల ప్రకారం.. మీరు అనేక శుభ ఫలితాలను పొందవచ్చని డ్రీమ్ సైన్స్ చెబుతుంది. ఈ నేపథ్యంలో.. కొత్త సంవత్సరం రోజున ఏ కలలు కనాలో.. ఎలాంటి సంకేతాలు లభిస్తాయో తెలుసుకుందాం.
నూతన సంవత్సరం రోజున కలలో గణేశుడిని చూసినట్లయితే.. ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో గణేశుడిని చూడటం ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. అలాగే కొత్త సంవత్సరంలో ఆ కల వచ్చిన వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి.
కలలో గణపతి బప్ప ఎలుకపై స్వారీ చేయడం కూడా శుభ సంకేతాలను ఇస్తుంది. ఈ కల ద్వారా జీవితంలోని కష్టాలు పరిష్కరించబడతాయని నమ్ముతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పెరుగుదల ఉంటుందని విశ్వసిస్తారు.
కొత్త సంవత్సరం వేళ కలలో దుర్గ మాతను చూసినట్లయితే ఆ కల నుండి శుభ సంకేతాలను పొందవచ్చు. ఈ కల వచ్చిన వ్యక్తి జీవితంలోకి ఆనందం రావచ్చు. అలాగే పెళ్లికానివారైతే త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటారు. కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం రావచ్చు.
అలాగే.. కలలో సూర్య భగవానుని చూస్తే మరింత శుభప్రదం అని చెబుతారు. ఈ కల శుభ ఫలితాల సాధనను సూచిస్తుంది. ఈ కల ద్వారా జీవితంలో పురోగతి ఉంటుందని.. వ్యాపారంలో అభివృద్ధి ఉండవచ్చు.
గమనిక : ఈ కథనంలో పేర్కొన్న నివారణలు/ప్రయోజనాలు/సలహాలు, ప్రకటనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. న్యూస్ మీటర్ మీడియా ఈ ఆర్టికల్ లో వ్రాసిన వాటిని ఆమోదించలేదు. ఈ వ్యాసంలో ఉన్న సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ప్రబోధాలు/నమ్మకాలు/గ్రంధాలు/పురాణాల నుండి సేకరించబడింది. కథనాన్ని అంతిమ సత్యంగా పరిగణించవద్దని పాఠకులకు అభ్యర్థణ. న్యూస్ మీటర్ మూఢ నమ్మకాలకు వ్యతిరేకం.