అక్కడ వంటకాల్లో మట్టితో చేసిన మసాలాలే వాడతారు.!

Residents of Hormuz Island use earthy spices in their cuisine. మనం వండే ఏ వంటకాల్లో అయినా మసాలాలు వేస్తే వచ్చే టేస్టే వేరె లెవల్‌లో ఉంటుంది. ఇక మాంసం కర్రీలో మసాలా వేసుకొని

By అంజి  Published on  16 Aug 2022 2:14 PM GMT
అక్కడ వంటకాల్లో మట్టితో చేసిన మసాలాలే వాడతారు.!

మనం వండే ఏ వంటకాల్లో అయినా మసాలాలు వేస్తే వచ్చే టేస్టే వేరె లెవల్‌లో ఉంటుంది. ఇక మాంసం కర్రీలో మసాలా వేసుకొని తింటే ఆ మజా వేరు. ప్రకృతిలో దొరికే వివిధ రకాల పదార్థాలతో రకరకాల మసాలాలను తయారు చేస్తారు. మార్కెట్లో కూడా వెరైటీ మసాలాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏ మసాలా అయినా పలు రకాల దినుసులతో తయారు చేస్తారు. కానీ, ఓ ఐలాండ్‌లో మాత్రం మట్టినే మసాలాగా చేసుకొని వాడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో సాస్‌లా కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మసాలాతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.

ఇరాన్ తీరానికి 8 కి.మీ దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో హోర్ముజ్ అనే ఐలాండ్‌ ఉంది. ఈ ఐలాండ్‌లో ఎటుచూసినా పసుపు, నీలం, ఎరుపు రంగు గుట్టలే కనిపిస్తాయి. అచ్చం ఇంద్ర ధనస్సులా కనిపించే ఈ ప్రాంతాన్ని రెయిన్‌బో ఐలాండ్ అని కూడా అంటారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్లే రంగు రంగుల గుట్టలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేల్చారు.


అక్కడ లభించే ఎర్రమట్టిని ప్రజలు వంటకాల్లో మసాలాగా ఉపయోగిస్తారు. ఆ మట్టిని గెలాక్ అని పిలుస్తారు. ఈ మట్టి నుంచి సూరఖ్ అనే పదార్థాన్ని తయారు చేసి సాసుగా కూడా ఉపయోగిస్తారు. మనం సాధారణంగా ఉపయోగించే సాసు కంటే ఇది పది రెట్లు రుచిగా ఉంటుందట. అక్కడికి వెళ్లిన పర్యాటకులు ఈ సాసు రుచి చూడడానికి ఎగబడుతారట. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన హేమటైట్‌ అనే ఐరన్‌ ఆక్సైడ్‌ వల్ల ఈ మట్టి ఏర్పడింది.

Next Story
Share it