ఈ ఆలయాల్లో ప్రసాదాలు ఎంతో ప్రత్యేకం
దేవాలయానికి వెళితే అక్కడ ఇచ్చే ప్రసాదం తీసుకోకుండా రాలేం. కొన్ని దేవాలయాల్లో ప్రసాదమైతే చాలా ప్రత్యేకం. మరీ ఏ దేవాలయాల్లో
By అంజి Published on 1 Jun 2023 11:00 AM ISTఈ ఆలయాల్లో ప్రసాదాలు ఎంతో ప్రత్యేకం
దేవాలయానికి వెళితే అక్కడ ఇచ్చే ప్రసాదం తీసుకోకుండా రాలేం. కొన్ని దేవాలయాల్లో ప్రసాదమైతే చాలా ప్రత్యేకం. మరీ ఏ దేవాలయాల్లో ఎలాంటి ప్రసాదం ఫేమస్సో చూద్దామా..
తిరుమల: తిరుమల లడ్డూకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఈ రుచి ఎక్కడా దొరకదు. బూందీలో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి చేసే ఈ ప్రత్యేక లడ్డూను తినని వారుండరు.
భద్రాద్రి: భద్రాద్రిలోని రామాలయంలో పులిహోర, దద్దోజనం ప్రసాదంగా ఇస్తుంటారు.
షిర్డీ: షిర్డీ సాయినాథ్ సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు. దీన్ని తీసుకోవడం పరమ పవిత్రంగా చెబుతారు.
సింహాచలం: సింహాచలం అప్పన ఆలయంలో పులిహోర, దద్దోజనం, ప్రసాదంగా ఇస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో పరమాన్నం ప్రసాదంగా అందిస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు.
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ప్రసాదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బెల్లం, బియ్యం, కొబ్బరితో వండే ఈ వంట చాలా రుచిగా ఉండటమే కాదు భక్తిభావం నింపుతుంది.
అన్నవరం: అన్నవరంలో గోధుమనూకతో ప్రసాదం తయారు చేస్తారు. ఎలా ఆరంభించారో తెలియదు గానీ.. భక్తులు దీన్ని ఇష్టంగా తింటారు.
పళని సుబ్రమణ్యస్వామి: ఈ ఆలయంలో ఖర్జూరం, అమృతపాణి అరటిపండ్లు, బెల్లం, నెయ్యి, యాలకులతో చేసే పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
తిరువనంతపురం: ఈ నగరంలోని గురువాయూర్‌లో పాలపాయసం ఇస్తారు. దీన్ని భక్తులు మహా ప్రసాదంగా సేవిస్తారు.
త్రిసూర్ వడక్కునాథన్: ఈ ఆలయంలో కొబ్బరిపూర్ణం ఇస్తారు. అంతటి తీపి పదార్థంపై ఈగలు అస్సలు వాలవట.
పూరీ జగన్నాథ్: ఈ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశిష్టమైనది. ఖర్చు ఎంతైనా భరించి ఆలయంలో కాజా తయారు చేసి అందిస్తారు.