గతంలో టెకీగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తూ ఉన్నారు. బెంగళూరు నగరంలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో పనిచేసిన బెంగళూరు వ్యక్తి జయనగర్ వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎర్రటి టీ-షర్టు ధరించిన వ్యక్తి గురించి శరత్ యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. అతని తల్లిదండ్రులు, ప్రేయసిని కోల్పోవడంతో అతడు మద్యపానానికి బానిస అయ్యాడు. దీంతో అతడు నిరాశ్రయుడిగా మారారు, మనుగడ కోసం యాచించడంపై ఆధారపడ్డాడు. వైరల్ వీడియోలో "నీ విద్యార్హత ఏమిటి?" అని అడగ్గా.. "నేను ఇంజనీర్‌ని. నేను గ్లోబల్ విలేజ్‌లోని మైండ్‌ట్రీలో పని చేశాను. నేను నా తల్లిదండ్రులను కోల్పోయాక నేను మద్యం తాగడం ప్రారంభించాను సార్." అని చెప్పుకొచ్చాడు.
వీడియోలో అతను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, డేవిడ్ హ్యూమ్‌లను కూడా ప్రస్తావించాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాల గురించి కూడా మాట్లాడాడు. పాపం.. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.