భారత్‌లో హనీమూన్‌కు అందమైన ప్రదేశాలు ఇవే

మన దేశంలోనే చాలా ఫేమస్ హనీమూన్ స్పాట్లు ఉన్నాయి. ఈ హనీమూన్ లోకేషన్లకు వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు.

By అంజి  Published on  23 March 2023 5:23 PM IST
India, Lifestyle, beautiful places

ఊటీలోని అందమైన పర్యాటక ప్రదేశం

లైఫ్ పార్టనర్‌తో కలిసి ప్రైవేటు ప్రదేశాలకు వెళ్లి హాయిగా చిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. ఏ ప్రాంతానికి వెళ్లాలనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంటుంది. అందుకే మన దేశంలోనే చాలా ఫేమస్ హనీమూన్ స్పాట్లు ఉన్నాయి. ఈ హనీమూన్ లోకేషన్లకు వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు.

1. ఊటీ: ఊటీని తమిళనాడు క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. నీలగిరి కొండలు, చాలా హిల్స్ మధ్య ఈ సిటీ ఉంది. మే నెలలో ఇక్కడ పర్యటిస్తే చాలా బాగా ఉంటుంది.ఎంతో మంది హాట్ సమ్మర్‌లో హనీమూన్‌కు వచ్చి కూల్ అవుతూ ఉంటారు.

2. మున్నార్: కేరళ అంటేనే పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఇక్కడ సరస్సులు, హౌస్ బోట్లు, స్పా సెంటర్లు అనేకం. మున్నార్‌లో చల్లని గాలి, పచ్చని తేయాకు తోటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడి కుటీరాలపై కూర్చొని ప్రకృతి అందాన్ని ఆస్వాదించవచ్చు.

3. కొడైకెనాల్: తమిళనాడులోని కొడైకెనాల్‌ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా అంటారు.ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడికి వెళ్తే ఎన్నో అందమైన ప్రదేశాలను చూడవచ్చు. చల్లటి వాతావరణంలో సేదతీరవచ్చు.

4. గోవా: హనీమూన్లకు గోవా ఉత్తమమైన ప్రదేశం. హనీమూన్ అందమైన జ్ఞాపకాలను ఇక్కడ పదిలం చేసుకోవచ్చు. తీర ప్రాంతాలు, గేమింగ్, పబ్బులు, రెస్టారెంట్లు అనేకం ఉంటాయి. వీకెండ్ పార్టీలు కూడా ఎక్కువగా జరుగుతాయి. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఇక్కడ అనువైన వాతావరణం ఉంటుంది.

5. కశ్మీర్: భారతదేశపు స్విట్జర్లాండ్‌గా కశ్మీర్‌ను సంబోధిస్తారు. ఎన్నో అద్భుతమైన దృశ్యాలు, అందమైన ప్రాంతాలు కశ్మీర్ సొంతం. ఇక్కడికి వెళ్తే కొత్త అనుభూతి వస్తుంది. ఈ టూర్ జీవితాంతం గుర్తు పెట్టుకునేంత జ్ఞాపకాలను అందిస్తుంది. అందుకే హనీమూన్‌కు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.

6. సిక్కిం: తెల్లని దుప్పటి పరచుకున్న హిమగిరులు, నీలి రంగు సింగారించుకున్న అందమైన సరస్సులతో సిక్కిం పర్యాటకుల మనసు దోచేస్తోంది. మంచు కొండల మధ్య ఉండే ఈ సరస్సులను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. ట్రెక్కింగ్‌‌కు బాగుంటుంది. టీ తోటలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా ఉంటుంది.

7. అండమాన్ నికోబార్: బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవులు దేశ పర్యాటకానికే తలమానికం.ఈ దీవుల్లో బీచ్‌లు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడి అభయారణ్యం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. వైపర్ ఐలాండ్‌లో చారిత్రక ప్రాంతాలతో పాటు అద్భుతమైన పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ తెలుగు, తమిళ, మలయాలం, హిందీ, బెంగాళీ భాషలతో పాటు నికోబరెసే భాష మాట్లాడే వారు కనిపిస్తారు.

Next Story