వర్షాకాలం వ్యాధుల నుంచి ఇలా తప్పించుకోండి!
Monsoon Health Tips. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు
By అంజి Published on 13 July 2022 5:19 PM ISTగత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వర్షా కాలంలో చాలా మంది తరుచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. వాతావరణం మారిపోవడం, వానల కారణంగా నీళ్లలో బ్యాక్టీరియా పెరగడం, తినే ఆహారం వల్ల వ్యాధులు వస్తాయి. వీటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం తప్పదు. అయితే వాటి బారిన పడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించి వానా కాలంలో వచ్చే వ్యాధుల నుంచి తప్పించుకోండి.
రాగి బిందెలో నీళ్లు
వర్షా కాలంలో 'ఈకోలీ' అనే బ్యాక్టీరియా తొందరగా వృద్ధి చెందుతుంది. దీని కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ ఉంది. అందుకే రాగి బిందెలో నీళ్లు నిల్వ చేసుకొని తాగాలి. రాగి బ్యాక్టీరియాతో పోరాడుతుంది. హానికర కొవ్వులను కూడా కరిగిస్తుంది. మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.
మితంగా తినాలి
వర్షాకాలంలో అంటువ్యాధులు, వ్యాధులు రాకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వర్షకాలంలో జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. అందుకే మితంగా మంచి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు తిన్నా సగం కడుపు ఖాళీగానే ఉంచుకోవాలి. జంక్ ఫుడ్స్ తగ్గించాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు. లేదంటే వాంతులు, విరేచనాలు ఇబ్బంది పెడతాయి.
ఈ ఫ్రూట్స్ బెటర్
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సీజనల్ పండ్లు ఎక్కువగా తినాలి. ఈ సమయంలో మొక్కజొన్న, జామ, అల్లనేరేడు, సపోటా వంటి పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందుకే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఆల్ బుకరా పండు తీసుకోవడం వలన మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. అలాగే బయటి నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి.