నేటి తరం యువత ప్రతిదీ కొత్తగా ఉండాలని కోరుకుంటారు. తాము ధరించే దుస్తుల నుంచి మొదలుకొని వాడే ప్రతి వస్తువులోనూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు కొత్త లుక్ లో కనిపించి ట్రెండ్ ను మారుస్తున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో అన్ని దేశాలు లాక్ డౌన్ విధించడంతో ఇంట్లో ఖాళీగా కూర్చున్న యువత మేకప్ చాలెంజ్, ఐస్ బకెట్,రైస్ బకెట్ వంటి చాలెంజ్ లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఎవరైనా ఏ పనైనా కొత్తగా చేస్తే దానిని వారి స్నేహితులకు చాలెంజ్ ఇస్తుంటారు. ఈ విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సరికొత్త ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. అదే కోతి తోక గడ్డం (మంకీ టెయిల్‌ బియర్డ్‌) ప్రస్తుతం ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఈ చాలెంజ్ ప్రకారం కోతి తోక ఆకారంలో గడ్డం తీసుకొని ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అదేవిధంగా ఆ చాలెంజ్ మరొకరికి ఇవ్వాలి. కోతి తోక కాస్త పొడవుగా ఉండి వంపు తిరిగి ఉంటుంది. అదే విధంగా వారి గడ్డం ఆకృతి కూడా ఆ విధంగా గీసుకోవడమే ఈ చాలెంజ్. 2019లో ఈ చాలెంజ్ అమెరికాకు చెందిన బేస్ బాల్ క్రీడాకారుడు మైక్ పియర్స్ "క్యాట్ టెయిల్‌ బియర్డ్‌"ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్ "మంకీ టెయిల్‌ బియర్డ్‌గా" ట్రెండ్ అవుతుంది.

ఈ చాలెంజ్ స్వీకరించే వారు గడ్డాన్ని కుడివైపు చివర దగ్గర నుంచి ఎడమవైపు దవడ పై వంపు తిరిగి పై పెదవి కుడివైపు చివరి వరకు ఉంచి మిగతా భాగమంతా గడ్డం తీసేయాలి. ఈ విధంగా ప్రస్తుతం మంకీ టెయిల్‌ బియర్డ్‌ ట్రెండ్ గా మారింది. కొత్తదనాన్ని ఇష్టపడే వారు ప్రస్తుతం ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ కేవలం విదేశాలలో మాత్రమే ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ విధమైన ఛాలెంజ్ మనదేశంలో కూడా ఎవరో ఒకరు మొదలు పెట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సామ్రాట్

Next Story