ఒంట్లో కాల్షియం తగ్గిందా?

ప్రస్తుతం చాలా మందిలో కాల్షియం లోపం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది.

By -  అంజి
Published on : 10 Feb 2026 11:13 AM IST

Lifestyle, calcium deficiency, anthropobiology, strengthen bones, Health Tips

ఒంట్లో కాల్షియం తగ్గిందా? 

ప్రస్తుతం చాలా మందిలో కాల్షియం లోపం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. శరీరంలో కాల్షియం లోపిస్తే కండరాల నొప్పులు,దంతాల ఆరోగ్యం క్షీణించడం,ఎముకలు బలహీనంగా మారడం, నీరసంగా అనిపించడం, చర్మ సమస్యలు వంటి సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారడం వల్ల రోజువారి పనులు చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాబట్టి శరీరానికి కావాల్సిన కాల్షియంను అందించాలి. ఇక శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకలను బలోపేతం చేయడానికి కొన్ని రకాలైన ఆహారపదార్థాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ వారు చెబుతున్న ఆ ఆహారపదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం..

పాలు

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.

రాగులు

రాగుల్లో శరీరానికి శక్తినిచ్చే ఎన్నో గుణాలున్నాయి.100 గ్రాముల రాగులను తీసుకుంటే 300mg కాల్షియం లభిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అంతేకాదు ఇవి జీవక్రియల పనితీరు మెరుగుపరచడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తాయి.

నువ్వులు

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుంటే సుమారు 88mg కాల్షియం శరీరానికి లభిస్తుంది. వీటీని తీసుకుంటే వృద్ధాప్య వయసులో కూడా ఎముకలు,దంతాలు,నరాల బలహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

గుడ్డు

ఉడికించిన గుడ్డులో వివిధ రకాల విటమిన్లు,ప్రొటీన్‌లతో పాటు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లును తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

ఆకుకూరలు

ఆకుకూరల్లో సైతం కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.అప్పుడే ఎముకలు బలంగా ఉండి వృద్ధాప్యంలో కూడా ఎటువంటి నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Next Story