చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం రణపాల మొక్కలను పెంచుతారు. ఇది కేవలం అందం కోసమే కాదు.. దీంట్లో ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో విశిష్ట స్థానం దక్కించుకుంది. దాదాపు 150 రోగాలను నయం చేస్తుందట. వగరు, పులుపుగా ఉండే ఈ ఆకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణాలు ఇవే
రణపాల ఆకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ 10 చుక్కల రణపాల రసం తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. జుట్టు సమస్య అసలే ఉండదు. తలనొప్పి ఉన్నవారు రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు
కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి.
షుగర్ వ్యాధి
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు రణపాల ఆకులను తింటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జీర్ణాశయ సమస్యలు, అల్సర్, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడేవారికి రణపాల ఆకు మంచి ఔషధం.