ఉదయం నిద్ర లేచాక చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఉదయం ఏదైనా తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగాలి. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చిన్న కప్పుతో టీ లేదా కాఫీ తాగితే మనకు ఎలాంటి నష్టం ఉండదు. అయితే టీ లేదా కాఫీ కంటే లెమన్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నీరు, నిమ్మ రసం, తేనె, పుదీనాతో చేసే ఈ 'టీ' ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెదడును యాక్టివ్ చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం 'లెమన్ టీ'ని ఏదైనా తిన్న తర్వాత తాగాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
లెమన్ టీని ఉదయం పరగడుపున కూడా సేవించవచ్చు. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. కాలేయానికి కూడా మేలు జరుగుతుంది. లెమన్ టీ తాగితే మైగ్రేన్ తగ్గుతుంది. అలాగే జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే ఈ టీని తాగడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. అందుకే అవకాశం ఉంటే టీ, కాఫీ తాగేకంటే లెమెన్ టీ తాగడానికి ప్రయత్నించండి.
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఇక్కడ తెలియజేస్తున్నాం.)