భారత్‌లో 2050 నాటికి 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చు: లాన్సెట్ స్టడీ

2050 సంవత్సరం నాటికి భారతదేశంలోని జనాభాలో 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చని విశ్లేషణ సంస్థ 'ది లాన్సెట్ జర్నల్' అంచనా వేసింది.

By Knakam Karthik  Published on  4 March 2025 5:09 PM IST
Lifestyle, Health, India, Overweight, Lancet Study, World

భారత్‌లో 2050 నాటికి 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చు: లాన్సెట్ స్టడీ

2050 సంవత్సరం నాటికి భారతదేశంలోని జనాభాలో 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చని ప్రముఖ విశ్లేషణ సంస్థ 'ది లాన్సెట్ జర్నల్' అంచనా వేసింది. భారతదేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 21.8 కోట్లు (పురుషులు), 23.1 కోట్లు (మహిళలు) ఉంటారని అంచనా వేసింది. ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్ ఉండవచ్చని, అమెరికా, బ్రెజిల్, నైజీరియా దేశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉంటాయని అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు, గ్లోబ్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD స్టడీ-2021 కోసం సహకరించారని ది లాన్సెట్ జర్నల్ తెలిపింది. అధ్యయనం ప్రకారం.. 2021 నాటికి ప్రపంచంలోని దాదాపు సగం మంది పెద్దలు అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారని.. అందులో కోటి మంది పురుషులు ఉంటే, కోటికి పైగా ఎక్కువ మంది మహిళలు ఉన్నారని ప్రచురించింది. కాగా భారతదేశంలో ఈ సంఖ్య 18 కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది. 8.1 కోట్ల మంది పురుషులు, 9.8 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపింది.

అయితే 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య దాదాపు 380 కోట్లకు పెరగవచ్చు అని ది లాన్సెట్ జర్నల్ అంచనా వేసింది. అందులో 180 కోట్ల మంది పురుషులు, 190 కోట్ల మంది మహిళలు ఉండవచ్చని తెలిపింది. కాగా ఆ సమయంలో ప్రపంచ వయోజన జనాభాలో వీరు సగానికి పైగా ఉంటారని పరిశోధకులు అంచనా వేశారు. ప్రపంచ జనాభాలో అధిక బరువు, ఊబకాయంతో చైనా, భారతదేశం, అమెరికాలు అధిక నిష్పత్తిలో కొనసాగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది.

2050 నాటికి భారతదేశంలో 5-14 సంవత్సరాల వయస్సున్న 1.6 కోట్ల మంది బాలురు, 1.4 కోట్ల మందికి పైగా బాలికలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. ఇది చైనా తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక సంఖ్యగా మారనుందని అంచనా వేశారు.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అధ్యయనాన్ని సమన్వయం చేసే వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) ప్రధాన రచయిత్ర ఇమ్మాన్యుయేల్ గకిడౌ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అధిక బరువు, ఊబకాయం మహమ్మారి ఒక విషాదం, సామాజిక వైఫల్యం అని ఆమె అన్నారు. ఇప్పటివరకు అత్యంత సమగ్రమైన ప్రపంచ విశ్లేషణ అయిన ఈ అధ్యయనం, ప్రభుత్వాలు,ప్రజారోగ్య సమాజానికి "తక్షణ జోక్యం, చికిత్స అవసరమయ్యే స్థూలకాయం యొక్క అత్యధిక భారాలను ఎదుర్కొంటున్న ప్రాధాన్యత జనాభాను గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపారు. ప్రధానంగా అధిక బరువుతో ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడుతుందని.. అని గకిడౌ చెప్పారు. కాగా ఫిబ్రవరి 23న భారత ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి బలమైన వాదన చేసిన నేపథ్యంలో తాజా అంచనాలు వచ్చాయి.

Next Story