రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్‌ చేయాలంటే?

మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌లు, ఇతర వైరస్‌లు వృద్ధి చెందేందుకు..

By -  అంజి
Published on : 17 Sept 2025 1:30 PM IST

brush, teeth, Bacteria in the mouth, Lifestyle, Health Tips

రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్‌ చేయాలంటే?

మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌లు, ఇతర వైరస్‌లు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇవి పళ్ల, చిగుళ్లకు అంటుకొని ఉంటాయి. సరైన రీతిలో బ్రష్‌ చేయడం వల్ల మాత్రమే వీటిని మనం తొలగించుకోవచ్చు. అయితే మనం బ్రష్‌ చేసుకున్న కొన్ని గంటల్లోనే నోటిలో ఇవి మళ్లీ పెరుగుతాయి. అందుకే రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సరిగా పళ్లు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌లు, వైరస్‌లు పెరిగి మన రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. నోటిలో మంట, చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి.

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 2 నిమిషాల పాటైనా బ్రష్‌ చేసుకోవాలి. అలాగే రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్‌ చేయాలి. నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎప్పుడు బ్రష్‌ చేసినా బ్యాక్టీరియా, ఫంగస్‌లను తొలగించుకొనే విధంగా నోటిలోని అన్ని భాగాలు కవర్‌ అయ్యేలా చూసుకోవాలి. దీని వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడి నోరు శుభ్రంగా ఉంటుంది.

Next Story