డయాబెటిస్‌ ఉంటే.. రాత్రి ఎన్ని చపాతీలు తింటే మంచిది?

డయాబెటిస్‌ (షుగర్‌ వ్యాధి)తో బాధపడేవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రాత్రి పూట అన్నానికి బదులుగా గోధుమ నూక ఉప్మా లేదా చపాతీ లేదా పుల్కాలు తింటుంటారు.

By అంజి  Published on  19 Jan 2025 8:22 PM IST
chapatis, diabetes, eat, night, Life style

డయాబెటిస్‌ ఉంటే.. రాత్రి ఎన్ని చపాతీలు తింటే మంచిది?

డయాబెటిస్‌ (షుగర్‌ వ్యాధి)తో బాధపడేవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రాత్రి పూట అన్నానికి బదులుగా గోధుమ నూక ఉప్మా లేదా చపాతీ లేదా పుల్కాలు తింటుంటారు. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్న వారు ఎక్కువ మంది చపాతీలు తింటుంటారు. దీనికి కారణం రైస్‌తో పోలిస్తే చపాతీల గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం. గోధుమ పిండిలో ఉండే ఫైబర్‌ వల్ల చపాతీలు తింటే షుగరల్‌ లెవల్స్‌ అంత వేగంగా పెరగవు. అయితే రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటే మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

దీనికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. రాత్రి పూట మీడియం సైజు రెండు లేదా మూడు చపాతీలను నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో పుల్కా మాదిరిగా కాల్చుకుని తింటే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. పెద్ద చపాతీలు అయితే రెండు సరిపోతాయట. చపాతీల్లో విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. వీటిల్లో ఫైబర్‌ ఉంటుంది. కనుక వీటిని తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాత్రిపూట న్నం మానేస్తున్నామని.. కొందరు చపాతీలను ఎక్కువగా తింటుందారు. ఇలా చేయడం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పరిమితంగా తినడం వల్లే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయని చెబుతున్నారు.

Next Story