బీరకాయతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

పొట్లకాయ కుటుంబానికి చెందిన బీరకాయలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్‌, విటమిన్‌ -సి, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

By అంజి  Published on  3 Feb 2025 2:00 PM IST
health benefits, Ridge Gourd

బీరకాయతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

పొట్లకాయ కుటుంబానికి చెందిన బీరకాయలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్‌, విటమిన్‌ -సి, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

బీరకాయలో కేలరీలు, సంతృప్త కొవ్వులు పరిమితంగా ఉంటాయి. ఇవి వెయిట్‌ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

బీరకాయలో విటమిన్‌ సి, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లు, కాలేయం, కడుపు, మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

బీరలో ఉండే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు భోజనంలో బీరకాయను భాగం చేసుకోవాలి.

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం ఖనిజాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

బీరలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాటానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

Next Story