యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యానికి యోగా చాలా మంచిది.
By అంజి
యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యానికి యోగా చాలా మంచిది. మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి యోగాను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. యోగాను రోజు వారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
యోగాలో శ్వాస కోస సంబంధ ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ఉన్నాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా అసూయ, కోపం, ద్వేషం లాంటివి తగ్గుతాయి. యోగాతో మనం చేసే పనిపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది.
యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఏ పనినైనా కంగారు లేకుండా నిదానంగా చేస్తాం. యోగాలో కొన్ని ఆసనాలు చేతులు, కాళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. యోగాతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతున్నట్టు రుజువైంది. మంచి నిపుణుల వద్ద యోగాను అభ్యసించడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. యోగా అనే పదం సంస్కృతంలోని 'యుజ్' నుంచి వచ్చింది. 'యుజ్' అంటే చేరడం లేదా ఏక చేయడం అని అర్థం. శరీరం, మనసును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం. యోగా చాలా పురతానమైనది. వేదకాలం నుంచే యోగా గురించి ప్రస్తావన ఉంది.