బ్లూ బెర్రీలు తినడం వల్ల కలిగే హెల్త్‌ బెనిఫిట్స్‌ ఇవే!

బ్లూ బెర్రీలు ఎక్కువగా సూపర్‌ మార్కెట్‌లలో కనిపిస్తుంటాయి. వీటి గురించి తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య కూడా తక్కువే.

By అంజి
Published on : 28 March 2025 1:45 PM IST

health benefits, eating , blueberries

బ్లూ బెర్రీలు తినడం వల్ల కలిగే హెల్త్‌ బెనిఫిట్స్‌ ఇవే!

బ్లూ బెర్రీలు ఎక్కువగా సూపర్‌ మార్కెట్‌లలో కనిపిస్తుంటాయి. వీటి గురించి తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య కూడా తక్కువే. అయితే ఈ బ్లూ బెర్రీలను ఆహారం భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్లూ బెర్రీల్లో ఫైబర్‌, విటమిన్‌ సి, మాంగనీస్‌ ఎక్కువగా ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఆప్షన్‌ అంటున్నారు నిపుణులు. బ్లూ బెర్రీలు తింటే కండరాల నొప్పి తగ్గడంతో పాటు యాక్టివ్‌గా పని చేస్తాయి. అందుకే వ్యాయామం తర్వాత వీటిని తీసుకుంటే మనకు అలసట ఉండదు. మంచి ఉపశమనం లభిస్తుంది.

కొందరికి రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తుంటాయి. ఇలాంటి వారు బ్లూ బెర్రీలను తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్‌, గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది. బ్లూ బెర్రీల్లో ఉండే పాలిఫినాల్స్‌, ఆంధో సయనిన్స్‌ మెదడును చురుగ్గా పని చేసేలా చేస్తాయి. దీని వల్ల మతిమరుపు సమస్య దూరం అవుతుంది. ఈ ఫలాలను తింటే కంటిలో రెటీనాకు మేలు జరిగి కంటి చూపు బాగుంటుంది.

Next Story