ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయ్‌!

కొన్ని రకాల ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

By అంజి  Published on  22 Feb 2025 1:30 PM IST
foods, bad cholesterol, Life style, Health Tips

ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయ్‌

కొన్ని రకాల ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

బీన్స్‌లోని పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. బీన్స్‌లోని లెసిథిన్‌.. కొలెస్ట్రాల్‌ కరిగిపోయేలా చేస్తుంది. దీనితో పాటు బీన్స్‌లో పొటాషియం, రాగి, మాంగనీసు, ఫోలిక్‌ అమ్లాలు కూడా ఉంటాయి. వంకాయలో ఫైటో న్యూట్రియంట్లు, అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి. వెల్లుల్లి రక్తపోటును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

సోయా చిక్కుళ్లు కాలేయానికి రక్తం నుంచి కొలెస్ట్రాల్‌ తొలగించే శక్తిని పెంచుతుంది. వీటిలో విటమిన్‌ బీ2, బీ6, విటమిన్‌ - ఈ ఉంటాయి. ఓట్‌ మీల్‌లోని బీటా గ్లూకాన్‌ అనే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను నిర్వీర్యం చేస్తుంది. సబ్జా గింజల పొట్టు పేగులలోనికి కొలెస్ట్రాల్‌ చేరనివ్వదు. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించే గుణం సబ్జా గింజలకు ఉంది. మొక్కజొన్న, అవిసె గింజలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని, రక్తపోటు, రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గిస్తాయి.

Next Story